టెన్త్ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ షెడ్యూల్..

టెన్త్ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ షెడ్యూల్..

తెలంగాణలో టెన్త్ 2019 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలోని ‘డీ’ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి టెన్త్ ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. జూన్ 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు పరీక్షలు జరుగుతాయి.
* విద్యార్థులు సంబంధిత పాఠశాలలో పీజు చెల్లించాల్సిన చివరి తేది మే 27
* ప్రధానోపాధ్యాయులు ఖజానా కార్యాలయం లేదా ఎస్‌బీఐ బ్యాంకు ట్రెజరీ బ్రాంచ్‌లలో ఫీజు చెల్లించుటకు చివరి తేదీ మే 29
* ప్రధానోపాధ్యాయులు కంప్యూటర్‌చే ముద్రించబడిన ఎస్‌ఆర్‌లతో సమా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాల్సిన చివరి తేదీ మే 31
* జిల్లా విద్యాశాఖాధికారులచే ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయానికి ముద్రితమైన ఎన్‌ఆర్‌లు సమర్పించవలసిన చివరి తేదీ జూన్ 3
* ఇక రూ.50 లేట్‌ ఫీజుతో పరీక్షలకు రెండు రోజుల ముందు వరకు చెల్లించవచ్చు.