ఆన్‌లైన్‌లో పదో తరగతి హాల్‌టికెట్లు

ఆన్‌లైన్‌లో పదో తరగతి హాల్‌టికెట్లు

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల హాల్‌టికెట్లు అందని విద్యార్థులు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. విద్యార్థులు స్కూళ్లలో తీసుకున్న హాల్‌టికెట్లు పోగొటుకున్నా, లేదా ఏదైనా ఇతర కారణాల వలన స్కూల్‌ యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకపోయినా వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. హాల్‌టికెట్లను  https://bsetelangana.org నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని డైరెక్టర్‌ సుధాకర్‌ సూచించారు.