11 - 17 నవంబర్‌.. ఈ వారం మీ వారఫలాలు

11 - 17 నవంబర్‌.. ఈ వారం మీ వారఫలాలు

మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) 
ముఖ్య కార్యాల్లో జాగ్రత్త అవసరం. మిమ్మల్ని ధైర్యం రక్షిస్తుంది. దైవ అనుగ్రహంతో పనులు ముందుకు సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో  జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యుల సలహాలు  అవసరం. ఆంజనేయస్వామిని దర్శించండి.
వృషభం:
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) 
శుభకాలం నడుస్తోంది. ఇష్టకార్యాలు ఫలిస్తాయి. సరైన నిర్ణయం తీసుకోండి. ఆదాయం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ముఖ్యవిషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు అవసరం. ప్రయత్నపూర్వక విజయం ఒకటి ఉంటుంది. ప్రయాణ  లాభముంది. శివారాధన ఉత్తమ ఫలాన్నిస్తుంది.
మిథునం: 
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) 
మనశ్శాంతీ, కీర్తీ లభిస్తాయి. ఒక గొప్ప పని పూర్తి చేస్తారు. మిత్రుల ద్వారా లాభం చేకూరుతుంది. విఘ్నాలు తొలగుతాయి. నమ్మకంతో నిర్ణయం తీసుకోండి. కొన్ని విషయాల్లో ఓర్పు అవసరం. వివాద విషయాల్లో జాగ్రత్త అవసరం. ఒక  శుభవార్త శక్తినిస్తుంది. ఇష్టదేవతారాధన మంచిది. 
కర్కాటకం:
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) 
సొంత నిర్ణయాలు లాభాన్నిస్తాయి. సుఖ సంతోషాలున్నాయి. మంచి ఆలోచనలు వస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంకల్పాలు నెరవేరతాయి. దూర ప్రయాణాల్లో విజయం లభిస్తుంది. బంధువులను కలుస్తారు. సంపదలు  పెరుగుతాయి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవాలి.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) 
అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. ధన లాభంతో సమస్యలు పరిష్కారమవుతాయి. పేరుప్రతిష్ఠలు ఉన్నాయి. మంచి మార్గంలో పయనించి అభీష్టసిద్ధిని పొందుతారు. జ్ఞానం వృద్ధి చెందుతుంది. నిదానంగా మాట్లాడితే సమస్య జటిలం కాదు.  విందువినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతారాధన ఉత్తమం.
కన్య: 
(ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) 
ధనలాభముంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. సమయం వృధా చేయరాదు. వస్తు, వస్త్ర ప్రాప్తి ఉంది. అలసటను దరిచేరనీయొద్దు. వాదనకు అవకాశమివ్వకండి. వివాదాలకు దూరంగా ఉండండి. లక్ష్మీ అనుగ్రహం ఉంది.  లక్ష్మీదేవిని దర్శించండి. 
తుల:
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) 
శుభకాలం నడుస్తోంది. ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోండి. ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలమైన కాలమిది. అనుకున్నది సాధిస్తారు. సకాలంలో దగ్గరివారి నుండి సహాయం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా  గడువుతారు. విష్ణు దర్శనం మేలుచేస్తుంది.
వృశ్చికం:
(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) 
ముఖ్యమైన కార్యాల్లో కొన్ని ఆటంకాలున్నాయి. నిదానంగా ఆలోచించి చేయండి. శ్రమ పెరుగుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులున్నాయి. ముఖ్యమైన వ్యక్తుల నుంచి సహకారం లభిస్తుంది. మొహమాటంతో సమస్యలు తలెత్తుతాయి. నవగ్రహ  శ్లోకాలు చదువుకోవాలి.
ధనుస్సు:  
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 
త్వరగా పనులు పూర్తవుతాయి. లాభాలున్నాయి. పలు ఇబ్బందులు తొలగుతాయి. పోయినవి తిరిగి వస్తాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. విజ్ఞానం వృద్ధి చెందుతుంది. గుర్తింపు లభిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) 
ధనధాన్య లాభాలున్నాయి. శ్రమ ఫలిస్తుంది. గృహనిర్మాణ యోగముంది. సరైన నిర్ణయం తీసుకోండి. ముఖ్య పనుల్లో ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కొన్ని పనులు  చివరి వరకూ వచ్చి ఆగే అవకాశం ఉంది. గణపతిని దర్శించండి.
కుంభం:
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) 
పట్టుదల విజయాన్నిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక మెట్టు పైకి ఎక్కుతారు. బాధ్యతలు పెరుగుతాయి. పదవీ లాభం ఉంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. బందు మిత్రుల సహకారం  ఉంటుంది. ఏకాగ్రతతో ముందడుగు వేయండి. ధర్మం కాపాడుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.
మీనం:
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) 
అదృష్ట యోగం ఉంది. తగిన ప్రతిఫలం ఉంటుంది. ముఖ్య పనుల్లో ఆలోచించి పనిచేయండి. స్వయంగా తీసుకునే నిర్ణయమే శక్తినిస్తుంది. దైవబలం సంపూర్ణంగా ఉంది. వ్యాపార లాభం ఉంది. ప్రశాంత జీవితం ఉంది. పేరు ప్రతిష్ఠలు  లభిస్తాయి. ఇష్టదేవతా స్మరణ శుభాన్నిస్తుంది.