మట్టిపెళ్లలు విరిగిపడి 11 మంది మృతి

మట్టిపెళ్లలు విరిగిపడి 11 మంది మృతి

నారాయణపేటలో విషాదం చోట చేసుకుంది. జిల్లాలోని మరికల్‌ మండలం తీలేరులో మట్టి పెళ్లలు విరిగిపడి 11 మంది మృతిచెందారు. మృతులంగా మహిళలేనని తెలిసింది. ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మట్టిదిబ్బల్లో మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య  సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.