శర్వానంద్‌కు 11 గంటల ఆపరేషన్

శర్వానంద్‌కు 11 గంటల ఆపరేషన్

యువ హీరో శర్వానంద్ కొని రోజుల క్రితం థాయ్‌లాండ్‌లో స్కైడైవింగ్ శిక్షణ తీసుకుంటూ ప్రమాదవశాత్తు గాయపడిన సంగతి తెలిసిందే.  అప్పుడేదో చిన్న గాయమే అనుకున్నా వైద్యులను సంప్రదించగా ఆ గాయం పెద్దదని, సర్జరీ అవసరమని తేలింది.  దీంతో చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చిన శర్వా ఈరోజు సర్జరీ చేయిచుకున్నారు.  సుమారు 11 గంటలపాటు ఈ సర్జరీ సాగింది.  ఇంకో రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు ఆయనకు సూచించారట.  దీంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న 96 రీమేక్ సెప్టెంబర్ వరకు వాయిదాపడనుంది.