మమతకు షాక్.. బీజేపీ గూటికి 11 మంది ఎమ్మెల్యేలు !

మమతకు షాక్.. బీజేపీ గూటికి 11 మంది ఎమ్మెల్యేలు !

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా రాష్ట్రంపై కమలదళం కన్నేసింది.  ఎలాగైనా బెంగాల్ కోటలో పాగా వేయాలని చూస్తున్న కమలంకు 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మంచి బూస్ట్ ఇచ్చాయి.  కష్టపడితే అధికారంలోకి రావచ్చని భావించిన కమలం పార్టీ ఏడాది ముందు నుంచే ఆ రాష్ట్రంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా..   మమత భేనర్జీకి ఊహించని షాక్‌ ఇచ్చింది బీజేపీ. ఇటీవల టీఎంసీకి రాజీనామా చేసిన కీలక నేత సువేందు అధికారి... తాను పోవడమే గాక తనతోపాటు మరో 10 మంది టీఎంసీ ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లాడు. సువేందు వెంట మహా అయితే.. మరో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు వెళతారని టీఎంసీ ముందుగానే ఊహించింది. అయితే.. వారి అంచనాలకు మించి ఇప్పుడు ఏకంగా 11 మంది టీఎంసీని వీడి... బీజేపీ పార్టీకి  వెళ్లారు. ఇవాళ బీజేపీలో చేరిన బెంగాళ్‌ ఎమ్మెల్యేల్లో సువేందు అధికారి, తాపసి మొండల్‌, అశోక్‌ దిండా, సుదీప్‌ ముఖర్జీ, సైకత్‌ పంజా, షి భద్ర దత్త, దీపాలి బిశ్వాస్‌, సుక్రా ముండా, శ్యామస్థ ముఖర్జి, బనశ్రీ మైతీ ఉన్నారు. వారితో పాటు పర్బ బుర్ద్యాన్‌ నియోజక వర్గ ఎంపీ సునీల్‌ మొండల్‌, మాజీ ఎంపీ దశరథ్‌ టిర్కీ కూడా అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు.