రివ్యూ: 118 మూవీ

రివ్యూ: 118 మూవీ

నటీనటులు: కల్యాణ్‌రామ్‌, నివేదా థామస్‌, షాలిని పాండే, నాజర్‌, హర్షవర్థన్‌, ప్రభాస్‌ శ్రీను తదితరులు

మ్యూజిక్: శేఖర్‌ చంద్ర

సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్‌

నిర్మాత: మహేష్‌ ఎస్‌ కోనేరు

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.గుహన్‌

 

ప్రయోగాలు చేయడంలో నందమూరి కళ్యాణ్ రామ్ ముందు వరసలో ఉంటాడు అనడంలో సందేహం లేదు.  కమర్షియల్ సినిమాలు చేస్తూనే... ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తుంటాడు. థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులకు నచ్చుతూనే ఉంటాయి.  ఈ తరహా థ్రిల్లర్ జానర్లో కళ్యాణ్ రామ్ చేసిన సినిమా 118.  ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజయింది.  ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందిందో లేదో తెలుసుకుందామా... 

కథ: 

కళ్యాణ్ రామ్ ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్.  జర్నలిజం ఎప్పుడు పరిశోధన చేస్తుంటాడు కాబట్టి సహజంగా నిద్రలో ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన కలలే వస్తుంటాయి.  అయితే, తరచుగా కళ్యాణ్ రామ్ కు ఒక కల వస్తుంటుంది.  ఆ కలలో నివేత థామస్ కనిపిస్తుంటుంది.  కొంతమంది వ్యక్తులు ఆమెను చంపాలని ప్రయత్నించడం.. ఆమె కారును లోయలోకి తోసెయ్యడం వంటివి కలలో కనిపిస్తుంటాయి.  మొదట్లో దాన్ని కలగా భావించి పెద్దగా పట్టించుకోడు.  తరచుగా అదే కల రావడం.. కలలో చూసిన వాటిని రియల్ గా చూస్తుండటం... కలలో కనిపించినట్టు కారు లోయలో పడిపోయి ఉండటంతో.. కళ్యాణ్ రామ్ షాక్ తింటాడు.  కలలో కనిపించిన నివేత కోసం వెతకడం మొదలుపెడతాడు.  కలలో కనిపించిన నివేత థామస్ నిజంగా ఉన్నదా...? ఉంటె ఆమెకు ఎదురైనా ఆపద ఏంటి..? ఆమెను గురించిన కలే కళ్యాణ్ రామ్ కు ఎందుకు వస్తుంది అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

ఇది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.  ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి.  ఓపెనింగ్ నుంచి ఎండ్ వరకు థ్రిల్లింగ్ ఉంటేనే సినిమా నిలబడుతుంది.  దర్శకుడు గుహన్ ఈ విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సినిమా ఓపెనింగ్ కలతో ప్రారంభం అవుతుంది.  కలలో వచ్చిన విషయాల చుట్టూనే కథను నడిపించాడు.  కలను ఆధారంగా చేసుకొని తన ఇన్వెస్టిగేషన్ లో ఎదురయ్యే ఒక్కో ప్రాబ్లమ్ ను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాడు హీరో.  ఫస్ట్ హాఫ్ ను చాలా థ్రిల్లింగ్ గా చూపించాడు.  అనవసరమైన సీన్స్ జోలికి వెళ్లకుండా.. కథమీదనే దృష్టిపెట్టాడు. 

ఫస్ట్ హాఫ్ లో చూపించిన థ్రిల్ సెకండ్ హాఫ్ లో చూపించలేకపోయారు.  కథ తిరిగి తిరిగి మరలా ఉన్నచోటికే వస్తుంది.  ఇది కొంచెం విసుగును తెప్పిస్తుంది.  ప్రతి క్లూ కోసం హీరో కలపైనే ఆధారపడం సిల్లీగా అనిపిస్తుంది.  వాస్తవానికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  నివేత థామస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెద్దగా కిక్ అనిపించదు.  ఇలాంటి సినిమాల్లో కామెడీని ఎక్స్ పెక్ట్ చేయకూడదు.  సినిమాలో చాలా లాజిక్ లు మిస్సయినా...  థ్రిల్లింగ్ ను కలిగించడంలో దర్శకుడు గుహన్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.  

నటీనటుల పనితీరు: 

గతంలో అతనొక్కడే లాంటి సస్పెన్స్ సినిమా చేసినా.. ఇది పూర్తిగా థ్రిల్లింగ్ జానర్లో వచ్చిన సినిమా.  ఇలాంటి పాత్రలు కళ్యాణ్ రామ్ గతంలో చేయలేదు. కళ్యాణ్ రామ్ నటన చాలా సహజంగా ఉంది.  నివేత థామస్ ఎప్పటిలాగే నటనతో ఆకట్టుకుంది.  కళ్యాణ్ రామ్ ప్రియురాలిగా షాలిని పాండే ఆకట్టుకుంది.  మిగతా నటీనటులు ఎవరి పాత్ర మేరకు వారు మెప్పించే ప్రయత్నం చేశారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

ఇలాంటి కథతో సినిమా చేయాలంటే సాహసం కావాలి.  ఆ సాహసాన్ని సినిమాటోగ్రాఫర్ గుహన్ మొదటిసారి దర్శకుడుగా మారి రిస్క్ తీసుకొని విజయం సాధించాడు.  కథను నడిపించిన తీరు బాగుంది.  థ్రిల్లింగ్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం.  శేఖర్ చంద్ర నేపధ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు.  

పాజిటివ్ పాయింట్స్: 

కళ్యాణ్ రామ్, నివేత థామస్ 

స్టోరీ 

ఫస్ట్ హాఫ్ 

సినిమాటోగ్రఫీ 

నెగెటివ్ పాయింట్స్: 

సెకండ్ హాఫ్ లో లాజిక్ లేకపోవడం 

చివరిగా:  థ్రిల్లింగ్ ను కలిగించిన 118