మెగా పవర్ స్టార్ @ 12 ఇయర్స్

మెగా పవర్ స్టార్ @ 12 ఇయర్స్

మెగాస్టార్‌ చిరంజీవి నట వారసుడిగా సినీ రంగంలోకి వచ్చిన రామ్‌చరణ్‌, తొలి సినిమా 'చిరుత'తో ఓకే అనిపించుకుని రెండో సినిమా 'మగధీర'తో తండ్రిని మించిన తనయుడిననే విషయాన్నీ ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్‌ టు బ్యాక్‌ కమర్షియల్‌ చిత్రాలే చేసుకుంటూ పోయాడు. చరణ్ మొదటి సినిమా చిరుత. చిరు కొడుకుగానే చరణ్ సినీరంగ ప్రవేశం జరిగింది. పూరీజగన్నాధ్ దర్శత్వంలో చరణ్ సినీరంగప్రవేశం జరిగింది.

చిరుత చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 12 ఏళ్ళు. చరణ్ ని మాస్ హీరోగా ఎలివ్ట్ చేస్తూ పూరి చేసిన ప్రయత్నం ఫలించి చిరుత మంచి సాధించింది. డాన్సులు, ఫైట్స్ తో అదరగొట్టిన చరణ్ స్టార్ సన్ అనుకున్నారు కానీ ఆ స్టార్ వారసత్వాన్ని కొనసాగించగలడా అనే సందేహాలు తొలి చిత్రం తర్వాత అలాగే ఉన్నాయి. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. చరణ్ పెర్ఫామెన్స్, నటనకు ప్రశంసలు దక్కాయి.

మగధీర చిత్రంతో చరణ్ ఇమేజ్ మాస్ ఆడియన్స్ లో దూసుకుపోయింది.  ఆ తర్వాత వచ్చిన ఆరెంజ్ చిత్రం నిరాశపరిచినప్పటికీ ఆ వచ్చిన రచ్చ, ఎవడు, నాయక్ లాంటి చిత్రాలు రాంచరణ్ మాస్ ఇమేజ్ ని పెంచుకుంటూ పోయాయి. మధ్యలో బ్రూస్ లీ లాంటి సినిమాలు దేబ్బెసినా ధృవ చిత్రంతో విభిన్నమైన ప్రయత్నాలకు సైతం తాను సిద్ధం అని చరణ్ సంకేతాలు పంపాడు.

ఇక గత ఏడాది విడుదలైన రంగస్థలం చిత్రంతో బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టడమే కాక అప్పటి దాకా ఆయన నటన గురించి వచ్చిన విమర్శలన్నిటికీ సమాధానం ఇచ్చాడు. అయితే మొన్న సంక్రాంతికి వచ్చిన వినయ విధేయ రామ డిజాస్టర్ గా నిలిచినా ఇప్పుడు జక్కన్నతో చేస్తున్న సినిమాతో మళ్ళీ ఫాంలోకి వస్తాడని భావిస్తున్నారు. ఇక చరణ్ చిత్రపరిశ్రమలో 12ఏళ్ళని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా '12GloriousYearsOfRAMCHARAN' అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.