లోయలో పడ్డ వాహనం.. 13 మంది మృతి

లోయలో పడ్డ వాహనం.. 13 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర్‌కాశి జిల్లాలో వ్యాను లోయలో పడి 13 మంది మృతిచెందారు. బట్వారీకి దగ్గరలోని శంగాలైలో ఈ రోజు సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో ఓ వ్యాను అదుపుతప్పి 200 మీటర్ల పైనుండి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు బట్వాడీలోని బకోలీ గ్రామానికి చెందిన 13 ఏళ్ల మీనాక్షి, 15 ఏళ్ల రాధలుగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో వ్యానులో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారు.