బెంగుళూరులో 144 సెక్షన్

బెంగుళూరులో 144 సెక్షన్

కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్, జీడీఎస్ పక్షం బల పరీక్ష ఎదుర్కోనుండగా బెంగుళూరు నగరంలో 144 సెక్షన్ విధించారు.  ఇది రేపు, ఎల్లుండి కొనసాగనుంది.  ఎల్లుండి వరకు వైన్ షాప్స్, బార్లు, పబ్బులు మూసివేయనున్నారు.  మొత్తం 205 సీట్లు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్, జేడీఎస్, బిఎస్పీకి 100 సీట్ల బలముండగా భాజాపాకు 105 సీట్లు ఉన్నాయి.  20 మంది సభ్యులు సభకు గైరుహాజరయ్యారు.  స్వతంత్ర్య ఎమ్మెల్యేల కోసం భాజాపా, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఘర్షణ తెలెత్తింది.  ఒకవేళ ఈరోజు సాయంత్రం చర్చ అనంతరం కుమారస్వామి రాజీనామా చేస్తే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఈ 144 సెక్షన్ విధించారు.