15 - 20 శాతం పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు..!

15 - 20 శాతం పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు..!

తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచారు. దీంతో జులై 1వ తేదీ నుంచి జరగున్న ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు లైన్ క్లియర్ అయిపోయింది. ఇక, ఫీజులను తాత్కాలికంగా పెంచేందుకు టీఏఎఫ్‌ఆర్‌సీ అవకాశం కల్పిస్తూ ఇచ్చన ప్రతిపాదనను కాలేజీలు అంగీకరించాయి. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో ఫీజులను 15 నుంచి 20 శాతం పెంచేందుకు ప్రతిపాదించడం.. కాలేజీ యాజమాన్యాలు అంగీకరించడం జరిగిపోయింది. దీంతో, ప్రస్తుతం రూ.50 వేలు లోపు ఉన్న ఫీజులను 20 శాతం పెరగనుండగా... 50 వేలకు మించి ఉన్న ఫీజులను 15 శాతం పెంచనున్నారు. ఇక, త్వరలోనే పూర్తిస్థాయి ఫీజులను ఖరారు చేయనున్నారు.