విమానం రెండు ముక్క‌లు.. 15 మంది మృతి

విమానం రెండు ముక్క‌లు.. 15 మంది మృతి

కేర‌ళ‌లో ఎయిరిండియా విమానం రెండు ముక్క‌లు అయిన ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 15 మంది మృతి చెందారు.. వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా కోజికోడ్‌కు వ‌చ్చింది విమానం. అయితే, రాత్రి 7.40 గంట‌ల‌కు ఎయిరిండియాకు చెందిన IX-1344 విమానం ల్యాండ్ అయ్యే స‌మ‌యంలో ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో పైల‌ట్, కో-పైలట్ సహా 15 మంది మృతిచెందిన‌ట్టు అధికారులు తెలిపారు.. 123 మందికి గాయాలు కాగా.. మ‌రికొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెబుతున్నారు. మరణించిన పైలట్‌ను దీపక్ వసంత్ సాఠేగా గుర్తించారు. ఇప్ప‌టికే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. స‌హాయ చ‌ర్య‌ల్లో పాల్గొని.. గాయ‌ప‌డిన‌వారిని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నాయి.. అయితే భారీ వ‌ర్షం కార‌ణంగా స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లుగుతున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.