చిత్తూరు జిల్లాలో ఆంధ్రా బ్యాంకులో భారీ చోరీ

చిత్తూరు జిల్లాలో ఆంధ్రా బ్యాంకులో భారీ చోరీ

 చిత్తూరు జిల్లా యాదమరి మండలం మొర్దనపల్లె అమర్ రాజా పరిశ్రమ ఆవరణలోని ఆంధ్రాబ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులో తనఖా పెట్టిన 15కేజీల బంగారం నగలను, 2లక్షల 66వేల నగదు చోరి జరిగినట్లు తెలుస్తోంది. వీటి మొత్తం విలువ మూడున్నర కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంకు మేనేజర్, క్యాషియర్ పాత్ర పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగలు, నగదు మాయంపై బ్యాంకు సిబ్బందిని విచారిస్తూన్నారు పోలీసులు.