తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు... ఈరోజు ఎన్నంటే... 

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు... ఈరోజు ఎన్నంటే... 

తెలంగాణలో గత రెండు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.  తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 1504 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,35,656కి చేరింది.  ఇందులో 2,16,353 మంది కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 17,979 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో 5 మంది మరణించారు.  దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1324కి చేరింది.  భద్రాద్రి కొత్తగూడెంలో 83, జీహెచ్ఎంసిలో 288, ఖమ్మంలో 84, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 118, నల్గొండలో 93, రంగారెడ్డిలో 115 కేసులు నమోదయ్యాయి.