16కు చేరిన కర్నూలు రోడ్డు ప్రమాద మృతులు..

16కు చేరిన కర్నూలు రోడ్డు ప్రమాద మృతులు..

కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి వెంకట రాముడు (30) మృతి చెందాండు. వెల్దుర్తిలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిని... 1. వెంకట్రాముడు (30), 2. గోపీనాథ్ (25), 3. రాముడు (45),04.  మునిస్వామి (30), 5. భాస్కర్ (30), 6. సోమన్న (40), 7. తిక్కన (40), 8. సాలన్న (30), 9. నాగరాజు (25), 10. పరశురాముడు (28), 11. సురేశ్‌ (30), 12. విజయ్ (35), 13. పగులన్న (45), 14. చింతలన్న (55), 15. మాసుం (35), వెంకట రాముడు (30)గా గుర్తించారు అధికారులు. వాహనంలోని వారంతా తెలంగాణలోని గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన వారు. నిశ్చితార్థం కోసం ఉదయం 9 గంటలకు గుంతకల్లు వెళ్లిన వీళ్లంతా... నిశ్చితార్థం ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇక రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను మందకృష్ణ, కాటసాని రాంభూపాల్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పరామర్శించారు. మృతులు కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.