మసీదులో 16వ శతాబ్దపు నాణేలు లభ్యం

మసీదులో 16వ శతాబ్దపు నాణేలు లభ్యం

దక్షిణ ఢిల్లీ శివార్లలోని ఖిర్కి మసీదులో 16వ శతాబ్దపు నాటి నాణేలు లభ్యమయ్యాయి. మసీదు ప్రాంతానికి రిపేర్లు చేస్తుండగా, కాంపౌండ్ వాల్ వద్ద లోధి వంశానికి చెందిన 254 నాణేలు లభించాయి.  ఇవన్నీ రాగి లోహంతో చేసినవని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు తెలిపారు. కాంపౌండ్ గోడ మత్తు పదార్థాల బానిసలకు అడ్డాగా  మారింది. అలాంటి చోట కేవలం 20 సెంటీమీటర్ల లోతులో లభించడం అధికారులకు ఆశ్చర్య కల్గిస్తోంది. భూమి పైభాగంలోనే ఉన్న ఈ నాణేలను ఇన్నాళ్ళూ ఎవరూ గుర్తించకపోవడం విశేషం. ఈ నాణేలకు ఎర్ర కోటకు కెందిన సైన్స్ విభాగానికి అందజేశారు. ఖిర్కి మసీదును ఫిరోజ్ షా తుగ్లక్ (1351-88) ప్రధానిగా ఉన్న సమయంలో నిర్మించారు. ఇక్కడ లభించిన నాణేలు షేర్ షా సూరీ (1538-1545) కాలం నాటివని తెలుస్తోంది. అంటే మసీదు నిర్మించిన తరవాత నాణేలను ఇక్కడ దాచారని అధికారులు భావిస్తున్నారు. ఈ నాణేలలో కొన్నింటిపై  పర్షియన్ భాషలో అక్షరాలు ఉన్నాయి.