17వ లోక్‌సభ నేటి నుంచే..

17వ లోక్‌సభ నేటి నుంచే..

ఇవాళ్టి నుంచి 17వ లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రెండు రోజులు ఎంపీ ప్రమాణ స్వీకారం ఉంటుంది. లోక్‌సభలో అత్యంత సీనియర్ అయిన బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారు. ముందుగా ప్రధాని మోడీ, కేబినెట్‌ మంత్రులు, ప్యానల్‌ ఛైర్మన్లు  ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు. ఇక.. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక 19వ తేదీన జరుగుతుంది. 20న పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు.