ఏపీలో అమాంతం పెరిగిన కరోనా కేసులు.. ఒకేరోజు 180 కేసులు

ఏపీలో అమాంతం పెరిగిన కరోనా కేసులు.. ఒకేరోజు 180 కేసులు

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం 115 కేసులు నమోదు అయితే.. ఇవాళ ఆ సంఖ్య అమాంతం పెరిగిపోయింది... ఒకేరోజు కొత్తగా 180 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 8,066 మంది నమూనాలు పరీక్షించగా 180 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఆ సంఖ్యలో రాష్ట్రంలో 79 కేసులు నమోదు కాగా... విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారే 101గా ఉన్నట్టు పేర్కొంది సర్కార్. తాజా కౌంట్‌తో కలుపుకొని.. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 3,971 కేసులు నమోదు అయ్యాయి.. ఇక, గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో... ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందినవారి సంఖ్య 68కి చేరింది. మరోవైపు 2,244 మంతి కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం కొవిడ్‌ ఆస్పత్రుల్లో 967 మంది చికిత్స పొందుతున్నట్టు అధికారులు ప్రకటించారు.