19 ఏళ్లకే సీఎంగా మారిపోనున్న ఉత్తరాఖండ్‌ యువతి

19 ఏళ్లకే సీఎంగా మారిపోనున్న ఉత్తరాఖండ్‌ యువతి

ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్  సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా సృష్టి గోస్వామి అనే యువతికి బాధ్యతలు అప్పగించనున్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుకున్నారు సీఎం త్రివేంద్ర సింగ్ రావత్. సీఎం నిర్ణయంతో  సృష్టి గోస్వామి ఒక్కరోజు విధులు నిర్వహించనుంది. సృష్టి గోస్వామి హరిద్వార్‌ జిల్లా దౌలత్‌పూర్‌ గ్రామం. ప్రస్తుతం ఈ యువతి బీఎస్సీ డిగ్రీ చదువుతోంది. 2018లో ఉత్తరాఖండ్‌ బాలల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా సృష్టి గోస్వామికి ఒక్కరోజు సీఎంగా ఛాన్స్‌ కొట్టేసి.. బాధ్యతలు నిర్వహించనుంది.