దారుణం: యువతిని ఐదురోజులు అడవిలో బంధించి...  

దారుణం: యువతిని ఐదురోజులు అడవిలో బంధించి...  

సోషల్ మీడియా అన్నది అందరికి అవసరమే.  అయితే, దానికి ఎప్పుడూ బానిస కాకూడదు.  సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి.  అందరూ చెడ్డవాళ్ళు అని చెప్పలేం.  సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాల వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, ఎన్ని ఆపదల్లో చిక్కుకుంటారో రోజూ వార్తల్లో చూస్తూనే  ఉన్నాం.  జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు.  

ఇన్ని హెచ్చరికలు చేసినా కొందరు ఆ ఉచ్చులో చిక్కుకుంటున్నారు.  విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.  కేరళ రాష్ట్రంలోని త్రిచూర్ కు చెందిన  ఓ యువతి ఖాళీ సమయం మొత్తాన్ని సోషల్ మీడియాకు కేటాయించేసింది.  గంటల తరబడి వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, షేర్ చాట్ ఇలా అన్నింటిలో యాక్టివ్ గా ఉంటోంది. అయితే, ఈ యువతికి షేర్ చాట్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు.  బిజినెస్ చేస్తున్నట్టు చెప్పాడు.  ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.  ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది.   ఓ రోజు ఆ యువకుడు సరాసరి ఇంటి దగ్గరకు బైక్ మీద వచ్చాడు.  ఆ యువతిని ఎక్కించుకొని లాంగ్ రైడ్ అంటూ కన్నంకులం తీసుకెళ్లాడు.  ఊరికి దూరంగా అడవిలోని నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లి ఆ యువతిపై అత్యాచారం చేశాడు.  అక్కడితో ఆగకుండా ఆ యువతిని అక్కడే బంధించాడు.  ఐదు రోజులుగా ఆ యువతి నరకం చూసింది.  అయితే, త్రిచూర్ లో యువతి మిస్సింగ్ కేసు నమోదు కావడంతో  పోలీసులు ఆ ఇంటికి సమీపంలో ఉన్న సిసిటీవీ ఫూటేజ్ నుపరిశీలించారు. యువతి ఓ బైక్ మీద వెళ్లినట్టు సిసిటీవీలో రికార్డ్ అయ్యింది.  బండి నంబర్ క్లియర్ గా లేకపోవడంతో,  యువతికి వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా, అడవిలోని ఓ ఇంట్లో బందీగా బాధిత యువతిని, బంధించిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు.