ఆ యుద్దానికి 50 ఏళ్ళు...
1971 డిసెంబర్ 3 వ తేదీన ఇండియా పాక్ దేశాల మధ్య అధికారికంగా యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం డిసెంబర్ 16తో ముగిసింది. కేవలం 13 రోజులపాటు మాత్రమే యుద్ధం కొనసాగింది. ఈ యుద్ధంలో 90వేలమంది పాక్ సైనికులు భారత్ కు భేషరతుగా లొంగిపోయారు. తక్కువ రోజులు జరిగిన యుద్ధంలో వేల సంఖ్యలో సైనికులు లొంగిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇండియా సైనిక శక్తి బలం ఎలాంటితో ఈ యుద్ధం ద్వారా నిరూపించింది. ఈ యుద్ధం తరువాతే తూర్పు పాకిస్తాన్ బాంగ్లాదేశ్ గా అవతరించింది. 1970 లో పశ్చిమ, తూర్పు పాక్ లలో జరిగిన ఎన్నికలే ఇండియా, పాక్ యుద్దానికి దారితీశాయి. ఎన్నికల్లో ముజిబుర్ రెహ్మాన్ నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ 167 చోట్ల విజయం సాధించింది. అందులో 163 స్థానాలు తూర్పు పాక్ లో ఉన్నాయి. మొత్తం 167 స్థానాలు గెలుచుకోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ లభించింది. అయితే, పశ్చిమ పాక్ కు చెందిన భుట్టో అధికారం మార్పిడికి అంగీకరించలేదు. అటు రాష్ట్రపతి కూడా ఒప్పుకోకపోవడంతో తిరుగుబాటు మొదలైంది. పశ్చిమ పాక్ సైనికులు తూర్పు పాక్ లో తిరుగుబాటును అణిచివేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కోటి మందికిపైగా శరణార్థులు ఇండియాకు వచ్చారు. తూర్పు పాక్ కు ఇండియా సహకారాలు అందిస్తుండటంతో పశ్చిమ పాక్ రెచ్చిపోయింది. ఇండియా వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో డిసెంబర్ 3 న యుద్ధభేరి మోగించింది ఇండియా. 13 రోజులపాటు సాగిన ఈ యుద్ధంలో పాక్ ఓటమిని అంగీకరించింది. డిసెంబర్ 16 సాయంత్రం 4:31 గంటలకు పాక్ ఓటమిని అంగీకరిస్తూ సంతకం చేసింది. ఈ యుద్ధం జరిగి నేటికీ 50 ఏళ్ళు పూర్తయింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)