కుప్ప కూలిన భారత్... 242/10

కుప్ప కూలిన భారత్... 242/10

భారత్ న్యూజిలాండ్ మధ్య ఈ రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే మొదట టాస్ గెలిచి ఫిల్ల్డింగ్ ఎంచుకుంది కివీస్. తరువాత బ్యాటింగ్ కి దిగిన భారత్ కి మొదట్లోనే షాక్ ఇచ్చారు కివీస్ బౌలర్లు... మొదటి టెస్ట్ లో హాఫ్ సెంచరీ చేసిన ఏకైక బాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ ని 7 పరుగులకే అవుట్ చేసారు. అయితే తరువాత వచ్చిన పుజారా మరో ఓపెనర్ పృథ్వి షా కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త గా ఆడారు. అయితే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తరువాత 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పృథ్వి షా వెనిదిరిగాడు. అయితే తరువాత వచ్చిన భారత్ సారథి విరాట్ కోహ్లీ మళ్ళీ నిరాశ పరిచాడు. కేవలం 3 పరుగులు చేసిన కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆ వెంటనే వైస్ కెప్టెన్ రహానే కూడా 7 పరుగులు చేసి క్యాచ్ రూపంలో పెవిలియన్ చేరుకున్నాడు. తరువాత వచ్చిన విహారి తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిదే ప్రయత్నం చేసాడు. అయితే టీ బ్రేక్ కు ముందు చివరి బాల్ కు విహారి(55) పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  టీ బ్రేక్ ముగిసిన తరువాత ఆట ఆరంభం అయిన కొద్దీ సేపటికే పుజారా(54) పంత్(12), ఉమేష్ యాదవ్(0) మూడు ఓవర్ల వ్యవధిలోనే ముగ్గురు అవుట్ అయ్యారు. షమీ(16 ) చివర్లో రెండు సిక్స్ లు కొట్టి అవుట్ అవడంతో భారత్ 242 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో జేమీసన్ ఒకడే 5 వికెట్లు తీసుకున్నాడు.