యూకే టాస్క్ ఫోర్స్ సంచలన వ్యాఖ్యలు: కరోనా వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చు... 

యూకే టాస్క్ ఫోర్స్ సంచలన వ్యాఖ్యలు: కరోనా వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చు... 

ప్రపంచంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి.  ఇందులో భాగంగానే  లండన్ లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, అస్త్రాజెనాక ఫార్మా కలిసి కరోనా వ్యాక్సిన్ ను డెవలప్ చేస్తున్న సంగతి తెలిసిందే.  చాలా దేశాలు ఈ వ్యాక్సిన్ పై నమ్మకం పెట్టుకున్నాయి.  వ్యాక్సిన్ అద్భుతంగా ఫలితాలు ఇస్తున్నట్టు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.  అయితే, ఈ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం యూకే టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది బ్రిటన్. ఈ టాస్క్ ఫోర్స్ కొన్ని వ్యాక్సిన్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.  కరోనా వైరస్ ను అరికట్టేందుకు అభివృద్ధి చేస్తున్న తొలితరం కరోనా టీకాలు అసంపూర్ణంగా ఉండొచ్చని, కరోనాను అరికట్టేందుకు పూర్తి స్థాయి కరోనా టీకా అందుబాటులోకి వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి అని టాస్క్ ఫోర్స్ చైర్మన్ కేట్ బింగమ్ పేర్కొన్నారు.  ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న టీకాలు కరోనా ను పూర్తిగా అరికట్టలేకపోయినా వ్యాధి తీవ్రతను కొంతమేర తగ్గిస్తాయని తెలిపారు.  అలానే అందరిపై ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని కూడా చెప్పలేమని, పరిస్థితులకు తగిన విధంగా అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.