ఆకట్టుకొని టీం ఇండియా... 165 ఆలౌట్..

ఆకట్టుకొని టీం ఇండియా... 165 ఆలౌట్..

భారత్ న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ నిన్న ప్రారంభం అయిన విషయం తెలిసిందే... అయితే మొదటి రోజు అభిమానులను నిరాశపరిచిన కోహ్లీ సేన రెండవ రోజుకూడా అదే ఆట ను కొనసాగించింది భారత ఆటగాళ్లు అందరూ కివీస్ బౌలర్ల ముందు తల వంచారు... ఫలితంగా మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 165 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. మొదటి రోజు ముగిసే సమయానికి 122 పరుగులుచేసి 5 వికెట్లు చేజార్చుకున్న భారత్ మరో 43 పరుగుల వ్యవధిలోనే మిగితా 5 వికెట్లను కూడా కోల్పోయింది. అయితే మొత్తం భారత బ్యాట్స్మెన్స్ లో ఒక్కరు కూడా అర్ధ శతకం సాధించలేదు. రహానే (46) ఇండియా తరుపున టాప్ స్కోరర్. చివర్లో షమీ 21 పరుగులు చేసి భారత్ ను 150 మార్క్ ను దాటించాడు. కివీస్ తరుపున  సౌథీ 4, జేమీసన్‌ 3 వికెట్లు తీసుకున్నారు. తరువాత బ్యాటింగ్ కి దిగిన కివీస్ ఒక వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది.