క‌శ్మీరీ వ్యాపారుల‌పై దాడులు

క‌శ్మీరీ వ్యాపారుల‌పై దాడులు

ఇద్దరు క‌శ్మీరీ వ్యాపారుల‌పై బుధవారం దాడులు జరిగాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని ల‌క్నోలో చోటుచేసుకుంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం పలు ప్రాంతాల్లో క‌శ్మీరీల‌పై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ల‌క్నోలోని ద‌లీగంజ్‌ ప్రాంతంలో ఇద్ద‌రు క‌శ్మీరీ వ్యాపారులు అక్కడి రోడ్డుపై డ్రై ఫ్రూట్స్ అమ్ముకుంటున్నారు. సాయంత్రం 5 గంట‌ల‌ సమయంలో విశ్వ హిందూ ద‌ళ్ సభ్యులు ఇద్దరు వ్యాపారులను కర్రతో చితకబాదారు. ఇద్దరు వ్యాపారులలో ఒకరు కొట్టొద్దని వేడుకున్నా కూడా వారు ఆగలేదు. అక్క‌డున్న కొంద‌రు వారిని అడ్డుకోవ‌డంతో విశ్వ హిందూ ద‌ళ్ సభ్యులు అక్కడినుండి వెళ్లిపోయారు. ఈ ఘటనను అక్కడున్న కొందరు తమ ఫోన్లలో బందించి సోషల్ మీడియాలో పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విశ్వ హిందూ ద‌ళ్ సభ్యులలో ఒకరైన బజరంగ్ సొంకర్ ను అరెస్ట్ చేశారు. మరొ కీలక సభ్యుడు హిమన్షు అవాస్తి కోసం గాలిస్తున్నారు.