వరల్డ్‌కప్‌లో ఇవాళ 2 మ్యాచ్‌లు

వరల్డ్‌కప్‌లో ఇవాళ 2 మ్యాచ్‌లు

క్రికెట్‌ అభిమానులకు నేడు పండగే..! ఇవాళ ఒకే రోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. బ్రిస్టల్‌లో ఆస్ట్రేలియాతో అఫ్గానిస్థాన్‌ తలపడనుండగా.. కార్డిఫ్‌లో శ్రీలంకతో న్యూజిలాండ్‌ తాడోపేడో తేల్చుకోనుంది. 
ఆస్ట్రేలియా మ్యాచ్‌ విషయానికి వస్తే.. నిషేధం ఎదుర్కొన్న స్టార్‌ ప్లేయర్స్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లు ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఐపీఎల్‌లో సూపర్‌ ఫామ్‌తో వార్నర్‌ సత్తాచాటగా.. ఇంగ్లండ్‌తో వామప్‌ మ్యాచ్‌లో స్మిత్‌ సూపర్‌ సెంచరీ చేశాడు. బ్యాటింగ్‌తోపాటూ బౌలింగ్‌లోనూ పటిష్టంగా ఉన్నా ఆసీస్‌ను అఫ్గాన్‌ ఏమేరకు  నిలువరిస్తుందో చూడాలి.
ఇక.. శ్రీలంకపై విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేయాలని కివీస్‌ జట్టు ఉవ్విళ్లూరుతోంది. వామప్‌ మ్యాచ్‌లో భారత్‌పై గెలిచిన న్యూజిలాండ్‌.. వెస్టిండీస్‌ చేతిలో ఓడింది.  మరోవైపు.. చాలామంది యువ ఆటగాళ్లతోనే శ్రీలంక బరిలోకి దిగుతోంది.