రెండేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, రాజీకి యత్నం...

రెండేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, రాజీకి యత్నం...

చట్టాలతో సంబంధం లేదు... శిక్షలు అమలు జరుగుతున్నా వెరువడంలేదు... కొందరిది దుర్భుద్ది అయితే... మరికొందరిది తెలిసీతెలియని తనం... పెరిగిన పరిసరాలు వాళ్లను అదోగతి పాలు చేస్తున్నాయి. ముక్కుపచ్చలారని రెండేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం చేసిన దారుణమైన ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామంలో జరిగింది. అయితే దీనిపై రాజీ కుదుర్చేందుకు పంచాయతీ పెద్దలు ప్రయత్నాలు చేశారు. అదికాస్త బెడిసికొట్టడంతో రెండేళ్ల చిన్నారి తాతయ్య పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.