ఈ హెల్మెట్ ధర రూ.2.8 కోట్లు.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఈ హెల్మెట్ ధర రూ.2.8 కోట్లు.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

మాములుగా హెల్మెట్ ధరలు ఎంత ఉంటాయి.. మహా అయితే రూ. 50వేలరూపాయల వరకు ఉండొచ్చు.  అదే ఫ్లైట్స్ లో ఆర్మీ పైలట్ ఉపయోగించే హెల్మెట్ ఎంత ఉంటుందో తెలుసా.. లక్షల్లో ఉంటుంది.  ఎందుకంటే దానికి ఫ్లైట్ కు సంబంధించిన టెక్నాలజీ అంతా ఆ హెల్మెట్ లో ఉంటుంది.  అయితే, అమెరికా ఎఫ్ 35 జెట్ ఫైటర్ లో వినియోగించే హెల్మెట్ ధర ఎంతో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.  

ఆ హెల్మెట్ ఖరీదు అక్షరాలా రూ. 2.8 కోట్లు ఉంటుందట.  ఈ స్థాయిలో ఉండటానికి కారణాలు ఉన్నాయి.  దీనిలో ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉన్నాయి.  ఈ జెట్ ఫైటర్లో అత్యధిక వేగంతో.. అత్యంత ఎత్తులో ప్రయాణం చేస్తుంటాయి. ఆ స్పీడ్ లో వెళ్లే సమయంలో శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది.  శరీరానికి రక్తసరఫరా పెద్దగా జరగదు.  ఇలా జరిగితే.. డెసిషన్ తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది.  వాటన్నింటిని ఈ హెల్మెట్ నివారుతుంది.  పైగా, ఎఫ్ 35 జెట్ ఫైటర్ లో ఆరు చోట్ల కెమెరాలు ఉంటాయి. హెల్మెట్ ద్వారానే చుట్టూ ఉన్న కెమెరాల వ్యూ ఎలా ఉన్నది అన్నది తెలుసుకోవచ్చు.  అంతేకాదు, పక్కనుంచి వెళ్లే విమానాలకు సంబంధించిన ఆడియోను కూడా వినే అవకాశం ఉంటుంది.  ఇవే కాదు ఇన్నో ఎన్నో అధునాతన టెక్నాలిజీని వినియోగించి తయారు చేస్తారట. అందుకే ఈ హెల్మెట్ ధర ఈ స్థాయిలో ఉంటుందని అంటున్నారు.