అంత్యక్రియల్లో పాల్గొన్న 20 మందికి కరోనా..!

అంత్యక్రియల్లో పాల్గొన్న 20 మందికి కరోనా..!

కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా అదుపులోకి రావట్లేదు. మరోవైపు గాలిలో సైతం కరోనా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దాంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. ఇక తాజాగా  అంత్యక్రియల్లో పాల్గొన్న 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఘ‌ట‌న బిహార్‌లో ఆదివారం చోటు చేసుకుంది. వివ‌రాల ప్రకారం.. బిహార్‌లోని  వ్యాపార‌వేత్త రాజ్ కుమార్ గుప్తా అనే వ్యక్తి  అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా అతడి అంత్య‌క్రియల్లో పాల్గొన్న‌ అత‌ని మేన‌ల్లుడితో పాటు కుటుంబంలో మ‌రొక‌రికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్న 37మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఏకంగా 20 మందికి పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చినవారిలో ఒకే గ్రామానికి చెందినవారు ఎక్కువగా ఉన్నారు. కరోనా కేసులు ఎక్కువగా రావటంతో ఆ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా గుర్తించారు.