రానాకు 200 కోట్లు !

రానాకు 200 కోట్లు !

 

అందరిలా కేవలం హీరో ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే కాకుండా భిన్నమైన సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ ముందుకు దూసుకెళుతున్న నటుడు రానా దగ్గుబాటి.  ఈయన సైన్ చేసిన పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లో 'హిరణ్య కసిప' కూడ ఒకటి.  గుణశేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.  2019 వేసవి నుండి మొదలుకానున్న ఈ సినిమా కోసం 200 కోట్లు ఖర్చు చేయనున్నారట.  హాలీవుడ్ స్థాయిలో ఉండేలా సినిమాను రూపొందిస్తారట.  ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రానా స్వయంగా నిర్మించనున్నాడు.