2వేల ఏళ్లనాటి స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ఎలా ఉన్నదో చూశారా? 

2వేల ఏళ్లనాటి స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ఎలా ఉన్నదో చూశారా? 

ఇప్పుడంటే ఎక్కడపడితే అక్కడ స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ ఉంటున్నాయి.  ప్రజలు కూడా స్ట్రీట్ ఫుడ్స్ కు అలవాటు పడిపోయారు.  మరి పురాతన కాలంలో ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయా అంటే ఉన్నాయని అంటున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు.  పురాతత్వ శాస్త్రవేత్తలు ఇటీవలే పాంపేయ్ నగరంలో తవ్వకాలు జరిపారు.  ఈ తవ్వకాల్లో 2000 ఏళ్లనాటి ఓ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ బయటపడింది.  ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ లో మట్టి పాత్రలు కొన్ని బయటపడ్డాయి.  ఆ పాత్రల్లో కొంత ఆహారపదార్ధం కూడా తవ్వకాల్లో బయటపడింది.  పాంపేయ్ నగరంలో అప్పట్లో అగ్నిపర్వతం పేలిన సమయంలో అక్కడి నుంచి ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోయారు.  ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో పరిశోధకులు తవ్వకాలు జరుపుతున్నారు.  ఈ తవ్వకాల్లో ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ బయపడింది.