షాక్: ఒక్కరోజులో 2వేలకు పైగా కరోనా మరణాలు... 

షాక్: ఒక్కరోజులో 2వేలకు పైగా కరోనా మరణాలు... 

ఇండియాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.  కరోనా కేసులు పెరుగుతుండటంతో దానికి తగిన విధంగా ఇండియాలో ఆసుపత్రులు, వైద్య సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు.   ఉన్న వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, లేదంటే వైరస్ బారిన పడాల్సి వస్తుందని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.   అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తేనే కరోనాను అదుపుచేయగలమని అంటున్నారు.  

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న ఇప్పటి వరకు మరణాల రేటు అదుపులోనే ఉన్నది.  కానీ, గడిచిన 24 గంటల్లో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.   రోజు రెండు వందలు లేదంటే మూడు వందలకు మించి కరోనా మరణాల సంఖ్య ఉండేది కాదు.  కానీ, గడిచిన 24 గంటల్లో ఏకంగా 2003  కరోనా మరణాలు సంభవించాయి.  అత్యధికంగా మహారాష్ట్రలో 1409, ఢిల్లీలో 437 మరణాలు సంభవించాయి.   దీంతో ఇండియాలో మొత్తం మరణాల సంఖ్య 11,903కి చేరింది.  దేశంలో 2వేలకు పైగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి.  కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా  పెరుగుతుండటంతో కరోనా కట్టడి, లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.