అప్‌గ్రేడెడ్: హోండా అమేజ్

అప్‌గ్రేడెడ్: హోండా అమేజ్

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా అమేజ్‌కు మార్పులు చేసి.. సరికొత్త డిజైన్‌తో సెకండ్ జనరేషన్ అమేజ్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. మూడు నెలల క్రితం ఈ వర్షెన్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఫస్ట్ జనరేషన్ కారుతో పోలిస్తే.. దీనిలో అవుట్ లుక్‌లో భారీ మార్పులు చేసింది. హోండా సాంప్రదాయ డిజైన్‌ను కొనసాగిస్తూనే.. ఇంటీరియర్‌లో మార్పులు చేసింది.

7 అంగుళాల టచ్ స్క్రీన్ ఉన్న డిజిపాడ్-2 ఇన్ఫోటైన్‌మెంట్‌ను అమర్చారు.. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, స్టార్ట్- స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమెంట్ కంట్రోల్, బ్యాక్ సీట్లకు ఏసీ సదుపాయాన్ని కల్పించారు. పెట్రోల్ వేరియంట్‌కు 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్, 7-స్టెప్ సీవీటీ ఆటోమేటిక్, సీవీటి తొలిసారిగా పెడల్ షిఫ్టర్‌ను కూడా అమర్చారు. ఇక డీజిల్ వేరియెంట్‌లో 1.5 లీటర్ టర్బోఛార్జెడ్ ఇంజిన్, ఆటోమేటిక్ ఆప్షన్‌ను కల్పించారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్ వేరియెంట్ ప్రారంభ ధర రూ.5.59 లక్షల నుంచి రూ. 7.99 లక్షల మధ్య.. డీజిల్ వేరియంట్ ధర రూ. 6.69 లక్షల నుంచి రూ.8.99 లక్షలుగా నిర్ణయించింది. అయితే కారు విడుదల సందర్భంగా మొదటి 20 వేల మంది కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది హోండా.