2019 ఎలక్షన్ ఫలితాలు లైవ్ అప్ డేట్స్

2019 ఎలక్షన్ ఫలితాలు లైవ్ అప్ డేట్స్

ఆళ్ల రామకృష్ణారెడ్డికి లోకేష్ అభినందనలు

* తనపై అత్యంత విశ్వాసంతో ఓట్లు వేసిన ప్రజలందరికి నమస్కారాలు
* అహ‌ర్నిశ‌లు తన కోసం శ్రమించిన టీడీపీ నాయ‌కులకు, కార్యక‌ర్తలకు కృత‌జ్ఞత‌లు
*తొలిసారి ఎన్నిక‌ల‌లో పోటీచేసిన తనకు మ‌ద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధ‌న్యవాదాలు
* మీడియా మిత్రుల స‌హ‌కారం మ‌రువ‌లేనిది
* ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు అందరికి ఆద‌ర్శం
* నియోజ‌క‌వ‌ర్గ పార్టీ నాయ‌కులకు, కార్యక‌ర్తల‌కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా
* మంగ‌ళ‌గిరి అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తా
* ప్రజ‌ల్లో ఉంటూ ప్రజాస‌మ‌స్యల‌పై పోరాడ‌తా

తెలంగాణ లోక్ సభ విజేతలు 

1) అసదుద్దీన్‌ ఓవైసీ(ఎంఐఎం)- హైదరాబాద్‌
 2) బండి సంజయ్‌(బీజేపీ)-కరీంనగర్‌
3)నామా నాగేశ్వర రావు(టీఆర్‌ఎస్‌)-ఖమ్మం
4)మాలోతు కవిత(టీఆర్‌ఎస్‌)-మహబూబాబాద్‌
5) మన్నె శ్రీనివాస్‌ రెడ్డి(టీఆర్‌ఎస్‌)-మహబూబ్‌నగర్‌
6)కొత్త ప్రభాకర్‌ రెడ్డి(టీఆర్‌ఎస్‌)- మెదక్‌
7) పోతుగంటి రాములు(టీఆర్‌ఎస్‌)- నాగర్‌ కర్నూల్‌
8) ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(కాంగ్రెస్‌)-నల్లగొండ
9)  వెంకటేశ్‌ నేత బోర్లకుంట(టీఆర్‌ఎస్‌)- పెద్దపల్లి
10) జి. కిషన్‌ రెడ్డి(బీజేపీ)- సికింద్రాబాద్‌
11) పసునూరి దయాకర్‌(టీఆర్‌ఎస్‌)- వరంగల్‌
12) ధర్మపురి అరవింద్‌(బీజేపీ)- నిజామాబాద్‌
13) ఎనుముల రేవంత్‌ రెడ్డి(కాంగ్రెస్‌)- మల్కాజ్‌గిరి
14) కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి(కాంగ్రెస్‌)-భువనగిరి
15) సోయం బాపూరావు(బీజేపీ)-ఆదిలాబాద్‌
16) బీబీ పాటిల్‌(టీఆర్‌ఎస్‌)-జహీరాబాద్
17)  జి.రంజిత్‌ రెడ్డి(టీఆర్‌ఎస్‌)- చేవెళ్ల

* విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గెలుపు. 44 వేల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుపై విజయం
* ఏలూరు పార్లమెంటు స్థానం వైసీపీ కైవసం. ఆ పార్టీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్‌ లక్షా 62 వేల 143 ఓట్ల తేడాతో గెలుపు


జగన్ కు ఉపరాష్ట్రపతి ఫోన్

* వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్
* శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్‌కు అభినందనలు
* తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని వెల్లడి

బోండా ఉమా కు షాక్

* విజయవాడ సెంట్రల్‌ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా కు షాక్
* 15 ఓట్ల తేడాతో వైసీపీ చేతిలో ఓటమి
* వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు విజయం
* చివరి వరకు విజయవాడ సెంట్రల్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ

* అనంతపురం లోక్ సభ స్ధానం వైసీపీ కైవసం. వైసీపీ అభ్యర్ధి తలారి రంగయ్య విజయం

కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్

* ప్రొద్దుటూరు-  రాచమల్లు శివప్రసాద్- 43,200 

* బద్వేలులో- వెంకట సుబ్బయ్య- 47,000
* మైదుకూరు- శెట్టిపల్లి రఘురామిరెడ్డి- 24,000
* కడప- అంజాద్ బాషా- 52,532 
* పులివెందుల- వైఎస్ జగన్- 90,543
* రాజంపేట- మేడా వెంకట మల్లికార్జున రెడ్డి- 38,000 

* కమలాపురం-రవీంద్రనాధ్ రెడ్డి- 27,000 
* రైల్వేకొడురు- కొరముట్ల శ్రీనివాసులు- 38,000
* జమ్మలమడుగు- సుధీర్ రెడ్డి- 52,035 

ఫలితాలపై స్పందించిన పవన్ కల్యాణ్

* ప్రధాని మోడీ, జగన్ కు శుభాకాంక్షలు
* ఇప్పటివరకు తన వెంట ఉన్న జనసైనికులకు కృతజ్ఞతలు
* తాను ఓడిపోయినందుకు ఏమాత్రం బాధగా లేదు
* తాను రెండు స్థానాల్లో ఓడిపోయినా కడదాకా రాజకీయాల్లో ఉంటా
* తుది శ్వాస వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తా

* గన్నవరంలో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ 820 ఓట్ల మెజార్టీతో విజయం
* రాప్తాడులో పరిటాల శ్రీరామ్‌ ఓటమి. వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఘన విజయం 

* గుంటూరు పశ్చిమలో టీడీపీ విజయం. 4,500 ఓట్లు మెజారిటీతో మద్దాలి గిరి గెలుపు

ఖాతా తెరచిన జనసేన

* అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరచిన వైసీపీ
* తూగో జిల్లా రాజోలు అభ్యర్ధి రాపాక వరప్రసాద్ గెలుపు
* ఉత్కంఠ పోరులో స్వల్ప మెజార్టీతో విజయం
* వరప్రసాద్ గెలుపు పై పార్టీ అధ్యక్షుడు పవన్ అభినందనలు

జగన్, మోడీలకు శుభాకాంక్షలుః చంద్రబాబు

* తిరుగులేని విజయం సాధించినందుకు మోడీ, జగన్ కు శుభాకాంక్షలు 
* ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం అందరి బాధ్యత
* జగన్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు
* కేంద్రంలో గెలిచిన బీజేపీ, మోడీకి శుభాకాంక్షలు
* గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు రాత్రింబవళ్లు పనిచేశారు
* విజయానికి కృషిచేసిన ప్రతి కార్యకర్తకూ మనస్ఫూర్తిగా అభినందనలు 
* పార్టీపై అభిమానంతో ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు

టీడీపీ ఓటమిపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

* చంద్రబాబుపై విరుచుకుపడిన అమిత్ షా
*రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఉంటే.. ప్రజలే ఆయనకు అండగా నిలిచేవారు
* ప్రతీపక్షాలను కూడగట్టే విషయంపై పెట్టిన దృష్టి ప్రజల సమస్యలపై పెడితే బాగుండేది
*ఈవీఎంలపై పోరాడినట్టుగా ప్రజల కోసం చంద్రబాబు పోరాడితే.. 
* ఇంకో నాలుగు ఓట్లు ఎక్కువగా వచ్చేయేమో

* ఇది గెలుపు కాదు, అఖండ విజయం: అమిత్ షా
* మోడీ అభినందనలు తెలిపిన ప్రియాంక గాంధీ

నరసాపురంలో నాగబాబు ఓటమి

* నరసాపురం లోక్ సభ స్ధానం వైసీపీ కైవసం
* వైసీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు విజయం
* సినీనటుడు, జనసేన అభ్యర్ధి నాగబాబు చిత్తు

* ఒంగోలు లోక్ సభ స్ధానం కైవసం చేసుకున్న వైసీపీ. మాగుంట శ్రీనివాసులు విజయం

* పలాసలో వైసీపీ అభ్యర్ధి డా. సీదిరి అప్పలరాజు గెలుపు. టీడీపీ అభ్యర్ధి గౌతు శిరీష పై 16,247 ఓట్ల మెజార్టీతో విజయం

మంత్రి లోకేష్ ఓటమి

* మంగళగిరి అసెంబ్లీ ఫలితాల్లో మంత్రి లోకేష్ ఓటమి
* వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణా రెడ్డి విజయం
* 5,372 ఓట్ల తేడాతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే గెలుపు

రేపటి జగన్ షెడ్యూల్ ఇదే..

* శుక్రవారం ఉదయం అధికారులు, గెలిచిన అభ్యర్ధులతో జగన్ సమావేశం
* శనివారం ఉదయం 11 గంటలకు సీఎల్పీ సమావేశం
* సీఎల్పీ సమావేశం ముగిశాక హైదరాబాద్ కు జగన్ పయనం
* గవర్నర్ నరసింహన్ తో మర్యాదపూర్వక భేటీ

* మంగళగిరి నియోజకవర్గం 20వ రౌండు పూర్తయ్యే సరికి 5279 ఓట్లు మెజారిటీతో  ఆర్కే ముందంజ

* కడప, నెల్లూరు, కర్నూలులో అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్

* టీడీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా 1500 ఓట్లతో ముందుజ

సత్తెనపల్లిలో కోడెల ఓటమి

* సత్తెనపల్లిలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పరాజయం
* వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు విజయం

నెల్లూరు సిటీ స్థానం వైసీపీ కైవసం

* నెల్లూరు సిటీ స్థానంలో మంత్రి నారాయణ ఓటమి
* వైసీపీ అభ్యర్ధి అనిల్ కుమార్ విజయం
* ఉత్కంఠ రేపిన పోరులో వైసీపీ గెలుపు

అమేథిలో రాహుల్ ఓటమి

* యూపీలోని అమేథిలో రాహుల్ ఓటమిపాలు
* కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో చిత్తు

టీడీపీ పరాజయంపై లోకేష్‌ స్పందన

 * ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తాం
* ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ ఎప్పుడూ ప్రజా పక్షమే
* ప్రధాని మోడీ, జగన్ లకు శుభాకాంక్షలు

వైఎస్ జగన్ ను కలిసిన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాగూర్. సుమారు 15 నిమిషాల పాటు సాగిన సమావేశం

అదిలాబాద్ లో బీజేపీ విజయం

* అదిలాబాద్ లోక్ సభ అభ్యర్ధిగా బీజేపీకి చెందిన సోయం బాపూరావు విజయం
* 58,493 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ పై బీజేపీ గెలుపు
* రెండో స్థానానికి పరిమితమైన అధికార టీఆర్ఎస్ పార్టీ
* బీజేపీ- సోయం బాపూరావు- 377194
* టీఆర్ఎస్- గొడెం నగేష్- 318701

* కాంగ్రెస్- రాథోడ్ రమేష్ -314061

* నోటా -13031
 

* నిజామాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్ధి మధుయాష్కీ డిపాజిట్ గల్లంతు

బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు

* బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రధాని మోడీ
* ఘనస్వాగతం పలికిన బీజేపీ నాయకులు
* మోడీ, అమిత్ షాలపై పూల వర్షం
* జయ జయ ధ్వనాలతో మార్మోగుతున్న బీజేపీ కార్యాలయం

* మంగళగిరి నియోజకవర్గం 18వ రౌండు పూర్తయ్యే సరికి 4,000 ఓట్లు మెజారిటీలో వైసీపీ అభ్యర్ధి ఆర్కే

* నేటి నుంచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు. కొత్త ప్రభుత్వం కొలువు దీరేవరకు ఆపద్ధర్మ సీఎం గా ఉండనున్న చంద్రబాబు

* మంగళగిరిలో 15వ రౌండు పూర్తయ్యే సరికి 1,005 ఓట్లు మెజారిటీతో ముందంజలో ఎమ్మెల్యే ఆర్కే

సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉంటారు

* జగన్ ను కలిసిన ఏపీ సీఎం ఎల్వీ సుబ్రహ్మణ్యం
* సీఎస్ గా ఎల్వీని కొనసాగించాలని జగన్ నిర్ణయం
* మా ప్రభుత్వంలో మీ సేవలు కావాలి
* సీఎస్ తో తొలి భేటీలో ప్రభుత్వ వ్యవహారాలపై స్వల్ప చర్చ
* ప్రమాణ స్వీకార వేదికపై కూడా చర్చ
* విజయవాడలో ఉన్న వేదికల గురించి తెలిపిన సీఎస్
* ఇందిరా గాంధీ స్టేడియం పై వివరించిన సీఎస్
* చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న జగన్

* మంగళగిరి లో 16 వ రౌండ్ కు వైసిపి  1900 ఓట్లు మెజారిటీ

* తిరుపతిలో వైకాపా భూమన కరుణాకర్ రెడ్డి గెలుపు

బిగ్ బ్రేకింగ్ః ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా

* సీఎం పదవికి రాజీనామా చేసిన చంద్రబాబు
* గవర్నర్ కు పంపిన రాజీనామా లేఖ
* రాజీనామాను ఆమోదించిన గవర్నర్
* తదుపరి ఏర్పాట్లు చేసే వరకు కొనసాగాలి
* ఏపీకి అందించిన సేవలకు ధన్యవాదాలు తెలిపిన గవర్నర్

కాంగ్రెస్ ను ఓడించిన 'నోటా'
* జహీరాబాద్ ఎంపి స్థానంలో గెలుపోటములను ప్రభావితం చేసిన 'నోటా' 
* 6వేల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి బి.బి పాటిల్ విజయం
* జహీరాబాద్ ఎంపీ స్థానం లో నోటా కు 11,135 ఓట్లు

నన్ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలుః ఉత్తమ్

* తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు
* టీఆర్ఎస్ అహంకారానికి ఇది చెంప పెట్టులాంటి తీర్పు
* అసెంబ్లీ ఎన్నికలకు... లోక్ సభ ఫలితాల్లో తేడా స్పష్టం అయ్యింది
* అసహ్యకరమైన, జుగుప్సాకర రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు
* ఎన్నికలపై పూర్తి స్థాయిలో రేపు గాంధీ భవన్ లో స్పందిస్తా

* చేవేళ్లలో టీఆర్ఎస్ విజయం

*ఎచ్చెర్లలో పరాజయం పాలైన మంత్రి కళావెంకట్రావ్ 

* విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి గద్దె రామ్మోహన్ రావు గెలుపు

గెలుపుపై స్పందించని జగన్

* పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశా.. విన్నా..
* వాళ్ల కోసం నేను ఉన్నా
* ప్రమాణస్వీకారం ఈనెల 30 న విజయవాడలో ఉంటుంది
* నాపై ఉన్న విశ్వాసంతో ప్రజలు ఓటు వేశారు
* 5 కోట్ల మందిలో ఒకరికే సీఎం అయ్యే అవకాశం వస్తుంది
* అలాంటి ఆరుదైన అవకాశం నాకు వచ్చింది

జ్యోతిరాధిత్య సింథియా ఓటమి

* మధ్యప్రదేశ్ గుణ స్థానం నుంచి బరిలోకి దిగిన జ్యోతిరాధిత్య సింథియా పరాజయం
* బీజేపీకి చెందిన కేపీ యాదవ్ చేతిలో 1.5లక్షల ఓట్ల తేడాతో ఓటమి

రెండు స్ధానాల్లో పవన్ కల్యాణ్‌ ఓటమి

* జనసేన అధినేతకు చేదు అనుభవం
* భీమవరం, గాజువాకలో ఓటమి

వైఎస్ జగన్ కు ప్రధాని మోడీ ఫోన్

* వైసీపీ అధినేత జగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్
* అద్భుతమైన విజయం సాధించావని అభినందనలు

* ప్రధాని మోడీకి ఇమ్రాన్ ఖాన్ అభినందనలు

* చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఘన విజయం. 26,298 ఓట్ల తేడాతో గెలుపు. 3 ఈవీఎంలు మోరాయింపు. వీవీ ప్యాట్ లను లెక్కిస్తున్న అధికారులు

* మే 26న ప్రధానిగా మోడీ రెండవసారి ప్రమాణస్వీకారం. ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్రపతి భవన్ అధికారులు. ప్రమాణోత్సవానికి హాజరుకానున్న దేశ, విదేశీప్రతినిధులు

*పలమనేరులో మంత్రి అమనాధరెడ్డి పై 30,945 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన వెంకటయ్య గౌడ్

*కుప్పంలో 30,309 ఓట్లతో గెలు పొందిన చంద్రబాబు నాయుడు

బిగ్ బ్రేకింగ్ః కవిత ఓటమి

* కల్వకుంట్ల కవితకు షాక్
* నిజామాబాద్ లో బీజేపీ గెలుపు
*కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపు

మహబూబ్ నగర్ డీకే అరుణ ఓటమి

* మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలుపు
* బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై 78వేల 120 ఓట్ల  మెజారిటీ తో విజయం
* అభ్యర్థుల వారిగా పోలైన ఓట్లు...

* మన్నె శ్రీనివాస్ రెడ్డి (టీఆర్ఎస్) 4,11,241

* డీకే అరుణ (బీజేపీ) 3,33,121

* వంశీ చంద్ రెడ్డి (కాంగ్రెస్) 1,93,513

భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటమి, గాజువాకలో వెనుకంజ

రాయబరేలిలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ విజయం

నిజామాబాద్ లో కవితకు చుక్కెదురు

* నిజామాబాద్ లో ఓటమికి చేరువలో సిట్టింగ్ ఎంపీ కవిత
* ఏడో రౌండ్ ముగిసే సరికి 65 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
* ఇంకా ఒక్క రౌండ్ మాత్రమే మిగిలి ఉంది

శతృష్ను సిన్హా ఓటమి

* పాట్నా సాహెబ్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి శతృష్ను సిన్హా ఓటమి
* ఆయనపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గెలుపు

పులివెందులలో జగన్ ఘన విజయం

* కడప జిల్లా పులివెందులలో జగన్ ఘన విజయం
* 2014తో పోలిస్తే ఈసారి 91 వేల ఓట్ల మెజార్టీ

ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

పెద్దపల్లిలో టీఆర్ఎస్ విజయం

* పెద్దపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్ధి వెంకటేశ్ నేత గెలుపు
* గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్ధి ఎ. చంద్రశేఖర్ 

టెక్కలిలో టీడీపీ అభ్యర్ధి, మంత్రి అచ్చన్నాయుడు విజయం

మండ్యలో సుమలత గెలుపు

* కర్ణాటక మండ్యలో ఇండిపెండెంట్ అభ్యర్ధి సుమలత విజయం
* జేడీఎస్ అభ్యర్ధి నిఖిల్ కుమారస్వామిపై గెలుపు

వయనాడ్ లో రాహుల్ ఘనవిజయం

* కేరళ వయనాడ్ లో రాహుల్ గాంధీ ఘనవిజయం
* 8లక్షల భారీ మెజార్టీతో గెలుపు
* దేశ చరిత్రలో ఆల్ టైం రికార్డు

వైఎస్ జగన్ కు ప్రధాని మోడీ అభినందనలు

గుంటూరు జిల్లాలో ఫ్యాన్ జోరు

* తెనాలి 9వ రౌండ్ కు వైసీపీ 3435 ఓట్ల ఆధిక్యం

* గుంటూరు పశ్చిమలో 6 వ రౌండ్ లో వైసీపీ 8722 ఓట్ల ఆధిక్యం
* గురజాల నియోజకవర్గం ఏడో రౌండ్ వైసీపీ 7260 ఓట్ల ఆధిక్యం
* సత్తెనపల్లి 14వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 16504 ఓట్ల ఆధిక్యతలో వైసీపీ
* ప్రత్తిపాడులో 6932 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ

వైసీపీ విజేతలు వీరే.. 

రఘురామరెడ్డి(మైదుకూరు), రాజా ఇంద్రావతి(రాజానగరం), అబ్బయ్య చౌదరి(దెందులూరు), పుప్పాల శ్రీనివాసరావు(ఉంగుటూరు)

ఓటమికి చేరువలో కల్వకుంట్ల కవిత

* నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్ధి కవిత వెనుకంజ
* ఆర్మూర్, కోరుట్ల, బాల్కొండ నియోజవర్గాల్లో బీజేపీకి మెజార్టీ

జగన్, నవీన్ పట్నాయక్ కు ప్రధాని మోడీ అభినందన

గెలుపుపై రోజా స్పందన

* నన్ను ఐరన్ లెగ్ అన్న వారికి నా గెలుపు  ఓ సమాధానం
* అడవాళ్లు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారు

వారణాసిలో మోడీ ఘనవిజయం

* ఉత్తరప్రదేశ్ వారణాసిలో ప్రధాని మోడీ ఘనవిజయం
* ప్రత్యర్ధి షాలిని యాదవ్ పై 4లక్షల ఓట్ల మోజార్టీతో గెలుపు
 

తాడేపల్లి నివాసంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, ఐఏఏస్ అధికారులు జవహర్ రెడ్డి ధనుంజయరెడ్డి ఇతర అధికారులు

ఫేస్ బుక్ లో స్పందించిన జగన్

ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయమని, వైసీపీ పార్టీని ఆశీర్వదించిన అశేష ప్రజానికానికి కృతజ్ఞతలు చెబుతున్నా..
 

నగరిలో రోజా విజయం

* చిత్తూరు జిల్లా నగరలో వైసీపీ అభ్యర్ధి రోజా గెలుపు 
* రోజాకు 2681 ఓట్ల ఆధిక్యం

రాజంపేటలో వైసీపీ ఘనవిజయం

* కడప జిల్లా రాజంపేటలో వైసీపీ లోక్ సభ అభ్యర్ధి మిథున్ రెడ్డి ఘనవిజయం

మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ విజయం

* మహబూబ్ నగర్ పార్లమెంట్ స్ధానాన్ని టీఆర్ఎస్ కైవసం
* బీజేపీకి చెందిన డీకే అరుణపై మన్నె శ్రీనివాస్ రెడ్డి విజయం
* 77, 121 ఓట్లతో టీఆర్ఎస్ గెలిచింది

చంద్రబాబు నివాసం ముందు వైసీపీ కార్యకర్తల హల్ చల్

* ఏపీ సీఎం చంద్రబాబు నివాసం ముందు వైసీపీ కార్యకర్తల హల్ చల్
* చంద్రబాబు నివాసానికి సమీపంలో బైకులపై వచ్చి టపాసులు పేల్చిన వైసీపీ కార్యకర్తలు
* వైసీపీ కార్యకర్తలను వారించే ప్రయత్నించిన టీడీపీ కార్యకర్త

*టీడీపీ కార్యకర్తలను చుట్టి ముట్టిన వైసీపీ కార్యకర్తలు

కరీంనగర్ లో దూసుకుపోతున్న కమలం

కరీంనగర్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. పందొమ్మిది రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ 74,052 ఆధిక్యంలో ఉంది.

బీజేపీ 4,19,716, 
టీఆర్ఎస్ 3,45,664, 
కాంగ్రెస్ 1,53,597 ఓట్లు వచ్చాయి.
 

ఫిరాయింపుదారులకు భంగపాటు
* పాతపట్నం నుంచి ఓటమి బాటలో కలమట వెంకట రమణ
* పార్టీ మారి తొలిసారి ఓటమికి గురైన మంత్రి సుజయ కృష్ణ
* గిడ్డి ఈశ్వరీని ఓడించబోతున్న పాడేరు ఓటర్లు
* జగ్గంపేట నుంచి బరిలోకి దిగి ఓటమి బాట అంచున జ్యోతుల

* రంపచోడవరం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయి.. పార్టీ మారి ఓటమి బాటలో పయనిస్తోన్న వంతల రాజేశ్వరీ
* ఓటమి బాటలో పామర్రు అభ్యర్ధి ఉప్పులేటి కల్పన
* తన కుమార్తెకు టిక్కెట్ దక్కించుకున్నా.. ఫలితం దక్కించుకోలేకపోయిన జలీల్ ఖాన్
* ఓటమి బాటలో గూడురు అభ్యర్ధి సునీల్
* ఓటమి బాటలో శ్రీశైలం అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్ రెడ్డి
* పార్టీ మారి మంత్రి పదవి దక్కించుకుని ఓటమి బాటలో పయనిస్తున్న మంత్రులు అమర్ నాధ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అఖిల ప్రియ

మల్కజ్ గిరిలో రేవంత్ రెడ్డి విజయం

* టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్కజ్ గిరి నుంచి గెలుపొందారు
* టీఆర్ఎస్ అభ్యర్ధి రాజశేఖర్ పై 6270 ఓట్ల ఆదిక్యంతో విజయం సాధించారు
* దీంతో తెలంగాణలో కాంగ్రెస్ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది

 మోడీకి రజనీకాంత్ విషెస్

ఓటమి బాటలో మంత్రులు..
01. కళా వెంకట్రావు
02. అచ్చెన్నాయుడు
03. సుజయ కృష్ణ రంగారావు
04. అయ్యన్నపాత్రుడు
05. గంటా శ్రీనివాసరావు
06. పితాని
07. దేవినేని ఉమ
08. కొల్లు రవీంద్ర
09. పత్తిపాటి పుల్లారావు
10. నక్కా ఆనందబాబు
11. లోకేష్
12. శిద్దా రాఘవరావు(ఎంపీ)
13. సోమిరెడ్డి
14. నారాయణ
15. అమర్నథ్‌రెడ్డి
16. కాల్వ శ్రీనివాసులు
17. అఖిల ప్రియ
18. ఆది నారాయణ రెడ్డి(ఎంపీ)

 

భువనగిరి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘన విజయం 

 • విజయనగరం వైసీపీ అభ్యర్థి వీరభద్రస్వామి విజయం 
 • టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు.. మెదక్‌- కొత్త ప్రభాకర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌-పోతుగంటి రాములు ఘన విజయం.

వాయినాడ్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఘన విజయం..

 • వైసీపీ అభ్యర్థులు అంజాద్‌బాషా(కడప), ఎలిజా(చింతలపూడి), జోగి రమేష్‌(పెడన), ఆదిమూలం(సత్యవేడు)లు ఘన విజయం.
 • ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తొలి విజయం నమోదు చేసింది. పార్వతీపురం వైకాపా అభ్యర్థి జోగారావు గెలుపొందారు.

ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. రాహుల్‌ గాంధీని ఆయన నివాసంలో కలిశారు

 • నరసాపురంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు నాలుగో రౌండ్ తర్వాత పడిన ఓట్లు 102
 • చిలకలూరిపేట నియోజకవర్గం ఆరో రౌండ్‌ ముగిసే సమయానికి వైసీపీకి 2972 ఓట్ల ఆధిక్యం
 • వినుకొండ 10,11 వ రౌండ్ ముగిసే సరికి వైసీపీకి 13612 ఆధిక్యం
 • ఖమ్మం పార్లమెంట్ 18వ రౌండ్‌ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు  1,05,237 ఓట్లు పైగా ఆధిక్యంలో ఉన్నారు

జగన్‌కు కేసీఆర్‌ ఫోన్‌
వైసీపీ అధినేత జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన కేసీఆర్.. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు.

గోవా పనాజీ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి. సీఎం పారికర్‌ కన్నుమూయడంలో ఇక్కడ ఎన్నిక జరిగింది.

 • శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థి అభ్యర్థి  రామ్మోహన్‌నాయుడు 6,600 ఓట్లతో లీడింగ్‌

నల్గొండ పార్లమెంట్‌ స్థానం..

 • 13 రౌండ్ ముగిసే సరికి 15741 ఓట్లతో కాంగ్రెస్ ముందంజ
 • ఉత్తమ్ - 333937
 • TRS - 318196
 • BJP - 40385
 • CPM  - 16937

 

 • ఖమ్మం పార్లమెంట్ 14వ రౌండ్‌ పూర్తయ్యేసరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు  69,444 ఓట్ల ఆధిక్యం 

ప్రకాశం జిల్లాలో..

 • దర్శి, సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు, యర్రగొండపాలెం, ఒంగోలులో వైసీపీ ఆధిక్యం
 • చీరాల, పర్చూరు, అద్దంకి, కొండపిలో టీడీపీ లీడింగ్‌
   

 

పెళ్లిలోనూ కౌంటింగ్ ఫీవర్..

 

ఎన్నికల ఫలితాలను టీవీలో వీక్షిస్తున్న వైసీపీ అధినేత జగన్, సలహాదారు ప్రశాంత్‌కిషోర్‌


 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో..

 •  బీజేడీ 94 లీడింగ్‌
 • బీజేపీ 28 లీడింగ్‌
 • కాంగ్రెస్‌ 2 లీడింగ్‌
 • సీపీఐ(ఎం)1, జేఎంఎం1, స్వతంత్రులు 1 స్థానంలో ముందంజ

మహారాష్ట్రలో..

 • బీజేపీ 24 స్థానాల్లో లీడింగ్‌
 • శివసేనకు 20 స్థానాల్లో ఆధిక్యం
 • నేషనల్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజ

విజయనగరం జిల్లా..

 • బొబ్బిలి:  వెంకట చిన్నప్పలనాయుడు- వైసీపీ- (ఆధిక్యం-3291 - 9th రౌండ్)
 • విజయనగరం: కోలగట్ల వీరభద్ర స్వామి: వైసీపీ- (ఆధిక్యం-3500- 13th round)
 • చీపురుపల్లి: బొత్సా సత్యనారాయణ- వైసీపీ(ఆధిక్యం-10709- 6th round)
 • నెల్లిమర్ల: బడుకొండ అప్పలనాయుడు: వైసీపీ (ఆధిక్యం-5400- 7th round)
 • గజపతినగరం: బొత్సా అప్పల నరసయ్య- వైసీపీ(ఆధిక్యం-14135 9th round)
 • పార్వతీపురం: అలజంగి జోగారవు: వైసీపీ- (ఆధిక్యం- 16106 -13th round)
 • సాలూరు: పీడిక రాజన్న దొర: వైసీపీ(ఆధిక్యం-4218- 4th round)
 • కురుపాం: పాముల పుష్పశ్రీ వాణి: వైసీపీ(ఆధిక్యం-20348- 8th round)
 • శృంగవరపుకోట:  కడుబండి శ్రీనువాసురవు: వైసీపీ(ఆధిక్యం-3750- 5 th round)
   
 • హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ 3671 ఓట్లతో లీడింగ్‌

కర్ణాటకలో బీజేపీ 23 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్‌ రెండేసి స్థానాల్లో ఆధిక్యం

షోలాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సుశీల్‌కుమార్‌ షిండే వెనుకంజ
బారామతి  ఎన్సీపీ అభ్యర్థి సుప్రియ సూలే ముందంజ 

 ఉత్తరప్రదేశ్‌లోని లక్నో బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణుల సంబరాలు..

 • మల్కాజ్‌గిరిలో 1515 ఓట్ల మెజారిటీలో రేవంత్ రెడ్డి
 • భువనగిరిలో 610 ఓట్లతో ఆధిక్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 భోపాల్‌ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ముందంజ 

ఫలితాలను టీవీలో వీక్షిస్తున్న వైసీపీ అధినేత జగన్‌

గాజువాక అసెంబ్లీ స్థానంలో మూడో స్థానంలో పవన్ కళ్యాణ్

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తొలి విజయం నమోదైంది.  దమన్‌ దయ్యూలో ఆ పార్టీ ఘన విజయం సాధించింది.

ఇవాళ సాయంత్రం వైసీపీ అధినేత జగన్‌ మీడియా సమావేశం

జిల్లాల వారీగా ఆధిక్యం..

 • కర్నూలు జిల్లాలో 13 చోట్ల వైసీపీ, ఒకచోట టీడీపీ లీడింగ్‌
 • కడప జిల్లాలో అన్ని స్థానాల్లో వైసీపీ ఆధిక్యం
 • ప్రకాశం జిల్లాలో టీడీపీ 4, వైసీపీ 8 స్థానాల్లో లీడింగ్‌
 • చిత్తూరు జిల్లాలో 13 వైసీపీ, ఒకస్థానంలో టీడీపీ లీడింగ్‌ 
 • అనంతపురం జిల్లాలో 12 వైసీపీ, రెండు స్థానాల్లో టీడీపీ లీడింగ్‌
 • నెల్లూరు, విజయనగరం జిల్లాలో అన్ని స్థానాల్లో వైసీపీ ఆధిక్యం
 • శ్రీకాకుళంలో 9 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో టీడీపీ ఆధిక్యం
 • ప.గో. జిల్లాలో 14 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో టీడీపీ ఆధిక్యం 
 • గుంటూరు జిల్లాలో 12 స్థానాల్లో వైసీపీ, 5 చోట్ల టీడీపీ ఆధిక్యం
 • కృష్ణా జిల్లాలో 9 చోట్ల వైసీపీ, ఏడుచోట్ల టీడీపీ ఆధిక్యం 
 • విశాఖ జిల్లాలో 10 చోట్ల వైసీపీ, నాలుగు చోట్ల టీడీపీ ఆధిక్యం 
 • తూ.గో జిల్లాలో 15 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో టీడీపీ ఆధిక్యం

కరీంనగర్‌లో  తొమ్మిదో రౌండ్ ముగిసే సరికి బిజెపి ఆధిక్యం 55,228

విశాఖపట్నం లోక్‌సభ స్థానం మూడు రౌండ్లు ముగిసే సరికి..

కర్ణాటక షిమోగలో 1లక్ష ఓట్ల మెజారిటీలో రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర..

పశ్చిమ బెంగాల్‌లో 24 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యం.. 17 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం..

నిజామాబాద్‌లో రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి వెనుకంజలో కొనసాగుతున్న కవిత

కుప్పంలో ఏడో రౌండ్ ముగిసేసరికి టీడీపీకి 5967 ఓట్ల ఆధిక్యం

కరీంనగర్ పార్లమెంట్ ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యే సరికి...

 • టీఆర్‌ఎస్‌ వినోద్ కుమార్:139798
 • బిజెపి బండి సంజయ్:191790
 • కాంగ్రేస్ పొన్నం ప్రభాకర్:-62065
 • 51992 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ...

మచిలీపట్నం పార్లమెంట్ 4వ రౌండ్ ముగిసేసరికి 

 • వైసీపీ అభ్యర్థి ఓట్లు 67583, టీడీపీ అభ్యర్థి ఓట్లు 57706, జనసేన అభ్యర్థి ఓట్లు 14164.. 9877 ఓట్లతో వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి అధిక్యం
 • పామర్రు.. 4 వ రౌండ్ పూర్తి అయ్యేసరికి వైసీపీకి 22334, టీడీపీకి 14038 ఓట్లు.. వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ 8296 ఓట్ల అధిక్యం
 • పెనమలూరు 4వ రౌండ్‌ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థికి 19977 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 16588 ఓట్లు..  వైసీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 3389 ఓట్ల అధిక్యం

అమేథీలోకాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై 7600 ఓట్లతో స్మృతి ఇరానీ లీడింగ్‌ 

 • పెదకూరపాడు వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్రావు నాలుగో రౌండ్‌ పూర్తయ్యేసరికి 9400 ఓట్లతో లీడింగ్‌
 • నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థికి 22 వేల ఆధిక్యం
 • పార్వతీపురం ఆరో రౌండ్ ముగిసే సరికి వైసీపీకి 6526 ఓట్ల మెజార్టీ
 • మంగళగిరిలో మూడో రౌండ్ ముగిసే సరికి వైసీపీకి 5400 ఓట్లు ఆధిక్యం
 • గజపతినగరం నియోజకవర్గం ఆరో రౌండ్‌ ముగిసే సరికి వైసీపీకి 9315 ఆధిక్యం

మంత్రి దేవినేని రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 900 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్

కరీంనగర్ పార్లమెంట్ 6వ రౌండ్ ముగిసే సరికి..

 • కాంగ్రెస్ - పొన్నం ప్రభాకర్ - 47366
 • టీఆర్ఎస్ - వినోద్ కుమార్ - 104127
 • బీజేపీ- బండి సంజయ్ - 143867

 

 • ఖమ్మం పార్లమెంట్ ఎనిమిదో రౌండ్‌ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు 40,734 ఓట్లు పైగా ఆధిక్యంలో ఉన్నారు
 • చిత్తూరు జిల్లా పుంగనూరు ఏడో రౌండ్ ముగిసే సరికి వైసీపీ ఆధిక్యం  2572

ఫలితాలను టీవీలో వీక్షిస్తూ.. విజయసాయిరెడ్డిని ఆలింగనం చేసుకున్న వైఎస్‌ జగన్‌

కేరళ వయనాడ్‌లో లక్ష ఓట్ల ఆధిక్యంలో రాహుల్‌ గాంధీ

గుంటూరు జిల్లా..

 • రేపల్లె 3 వ రౌండ్ కు టీడీపీ 5839 ఓట్లు ఆధిక్యం
 • పత్తిపాడు  5 వ రౌండ్ కు వైసీపీ 9557 ఓట్లు ఆధిక్యం
 • తెనాలి 3 వ రౌండ్ వైసీపీ 1518 ఓట్లు ఆధిక్యం.
 • బాపట్ల 3వ రౌండ్ కు వైసీపీ 4950 ఓట్లు ఆధిక్యం
 • పొన్నూరు 5 వ రౌండ్ కు వైసీపీ 1759 ఓట్లు ఆధిక్యం.
 • రేపల్లె 4 రౌండ్ కు  టీడీపీ 6840 ఓట్లు ఆధిక్యం
 • వేమూరు 4వ రౌండ్ కు వైసీపీ  5075 ఓట్లు ఆధిక్యం

 

 • 15వేల ఓట్ల ఆధిక్యంలో సికింద్రాబాద్‌ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి 
 • మంగళగిరిలో మంత్రి లోకేష్‌పై 2816 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 

పరిటాల శ్రీరామ్‌ వెనుకంజ

 • అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌ వెనుకంజ
 • ఉరవకొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి లీడింగ్‌

 

మథురలో 35,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి హేమమాలిని.

 • గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ముందంజ
 • ఒడిషాలో బీజేడీ 10 స్థానాల్లో, బీజేపీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
 • ఫలిబిత్‌లో వరుణ్‌గాంధీ 50,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు

కర్ణాటక లోక్‌సభ ఎన్నికల ట్రెండ్‌...

 కృష్ణా జిల్లాలో పది నియోజకవర్గాల్లో  వైసీపీ, ఆరు స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉంది. 

గాజువాకలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ లీడింగ్‌ 


గుజరాత్‌లోని గాంధీనగర్‌ నియోజకవర్గంలో లక్షా పాతికవేల ఓట్ల ఆధిక్యంలో అమిత్‌ షా..

 • చిత్తూరు జిల్లా పిలేరు అసెంబ్లీ మొదటి రౌండ్ టీడీపీకి 296 ఓట్ల లీడ్‌
 • నగరి నాలుగో రౌండ్ వైసీపీ అభ్యర్థి రోజాకు 3789 లీడ్

కరీంనగర్ పార్లమెంట్ స్థానం..

బీజేపీ - 1,03,940, టీఆర్‌ఎస్‌ - 82,431, కాంగ్రెస్ - 38,881

 • కుప్పం నాలుగో రౌండ్ 2015 ఓట్లుతో టీడీపీ లీడ్


తాడేపల్లిలో జగన్ నివాసానికి  'జగన్‌, ఏపీ సీఎం' నేమ్‌ బోర్డు తెచ్చిన అభిమానులు

 • విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోని అన్ని స్థానాల్లో వైసీపీ ఆధిక్యం. శ్రీకాకుళం జిల్లాలోని 9 స్థానాల్లో ముందంజ.

మంత్రలు లోకేష్,  అచ్చెన్నాయుడు, నారాయణ, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, ఆదినారాయణ, సిద్ధా రాఘవరావు, అఖిలప్రియ, చినరాజప్ప, గంటా శ్రీనివాస్, సుజయకృష్ణ రంగారావు, కళావెంకట్రావు వెనుకంజలో ఉన్నారు. దేవినేని ఉమ, జవహర్, ప్రత్తిపాటి, అమర్నాథ్ రెడ్డి ముందంజలో ఉన్నారు.

 • గుంటూరు పార్ల‌మెంట్ వైసీపీ ఆధిక్యం
 • నంద్యాల పార్ల‌మెంట్ వైసీపీ ఆధిక్యం
 • క‌ర్నూలు పార్ల‌మెంట్ వైసీపీ ఆధిక్యం
 • విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట్ వైసీపీ ఆధిక్యం

ఏపీలో వైసీపీ జోరు.. 130కి పైగా స్థానాల్లో లీడింగ్‌.

గుంటూరు జిల్లాలో ..

 • మాచర్ల, గురజాల, నరసరావుపేట, పెదకూరపాడు, చిలకలూరిపేట, వినుకొండ, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, తెనాలి, రేపల్లె, వేమూరు, ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అధిక్యం

బెంగళూరు సెంట్రల్‌ స్వతంత్ర  అభ్యర్థి ప్రకాష్‌రాజ్‌ వెనుకంజ


నిజామాబాద్ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కె.కవిత 18 వేల ఓట్ల తేడాతో వెనుకంజ

 • మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి 1342 ఓట్ల వెనుకంజ
 • నల్లొండ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  601 ఓట్ల వెనుకంజ
 • గుంటూరులో మూడు నియోజకవర్గాల్లో టీడీపీ లీడింగ్‌, నాలుగు చోట్ల వైసీపీకి ఆధిక్యం  

శ్రీకాకుళం జిల్లాలో..

 • పాతపట్నం నియోజకవర్గం రెండో రౌండ్ లో 2360 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి 
 • పాలకొండ మూడో రౌండ్ లో 1100 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి కళావతి

కుప్పంలో మూడో రౌండ్ 1140 ఓట్లతో చంద్రబాబు లీడింగ్‌

 • చిత్తూరు....పూతలపట్టు అసెంబ్లీ.... వైసీపీ లీడ్ 514
 • మహబూబ్ నగర్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డికి 14,893 ఓట్ల ఆధిక్యం..
 • జీడి నెల్లూరులో వైసీపీకి 1872 ఆధిక్యం
 • ఖమ్మం...5 రౌండ్లు పూర్తి అయ్యే సరికి 20,000 అధిక్యంలో నామా నాగేశ్వరరావు
 • మెదక్ నాలుగో రౌండ్ ముగిసే సమయానికి 66 వేల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రబాకర్ రెడ్డి.
 •  జహీరాబాద్ మూడో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ కు 10 వేల ఆధిక్యం.

వైఎస్‌ జగన్‌ నివాసం ఉంటున్న తాడేపల్లిలో వైసీపీ టపాసుల మోత

నాగర్ కర్నూల్ ట్రెండ్స్..

తొలి రౌండ్‌ ముగిశాక ఆదిలాబాద్‌ ట్రెండ్..

దేశ వ్యాప్తంగా 300లకుపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఎన్డీయే. 

వారణాసిలో ప్రధాని మోడీ 20వేల ఓట్ల లీడింగ్‌.

గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వెనుకంజ.

 • భీమవరం రెండో రౌండ్ ముగిసేసరికి వైసీపీకి 2400 మెజారిటీ

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం 

 • 3వ రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ ఆధిక్యం 11770
 • చెంద్రశేఖర్ (CONG) : 21694
 • వెంకటేష్ నేతకాని (TRS) : 33464
 • ఎస్.కుమార్ (BJP) : 11221

పులివెందులలో 2003 ఓట్ల ఆధిక్యంలో జగన్ 

మంత్రులు లోకేష్‌, గంటా, సోమిరెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, నారాయణ వెనుకంజ.

 • తెనాలి ఎమ్మెల్యే స్థానంలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ లీడింగ్‌ 
 • మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి వెనుకంజ .. బాపట్ల తొలి రౌండ్లో వైసీపీకి 1086 ఓట్లు ఆధిక్యం

విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లోనూ ముందంజలో ఉన్న వైసీపీ

 • విజయనగరంలో  వైసీపీ అభ్యర్థి కోలగట్ల 4,228 ఓట్ల ఆధిక్యం
 • వెనుకబడ్డ అశోక గజపతిరాజు కుమార్తె అదితి గజపతి
 • బొబ్బిలిలో మంత్రి సుజయ్‌ కృష్ణ 1886 ఓట్లతో వెనుకంజ


గుజరాత్‌ గాంధీనగర్‌ ఎంపీ అభ్యర్థి అమిత్‌షా లీడింగ్‌ 

 • ఖమ్మం పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఓట్ల లెక్కింపు లో మూడవ రౌండ్ పూర్తయ్యే సరికి  6441 ఓట్ల మెజారటీ తో ముందంజలో ఉన్న టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు
 • శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం మొదటి రౌండ్ లో 480 ఓట్ల స్వల్ప మెజారిటీతో కింజరాపు రామ్మోహన్ నాయుడు
 • రాజంపేట ఎంపీ స్థానం తొలి రౌండ్లో వైసీపీ ఆధిక్యం 

మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌ 790 ఓట్లతో వెనుకంజ.

వాయినాడ్‌లో రాహుల్‌ గాంధీకి 40 వేల ఓట్ల ఆధిక్యం

 • శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మొదటి రౌండ్ వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి 1180 ఓట్ల ఆధిక్యం 
 • రాజాం మొదటి రౌండ్ వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు 278 ఓట్ల ఆధిక్యం
 • కుప్పంలో వైసీపీ 428 ఓట్లు లీడ్
 • నగరిలో రెండో రౌండ్ వైసీపీ అభ్యర్థి 1506 ఆధిక్యం

 

మొదటి రౌండ్ ముగిసే సరికి నెల్లూరు జిల్లాలో..

 • సూళ్లూరుపేట 1476 ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి సంజీవయ్య
 • వెంకటగిరిలో 2478 ఓట్ల మెజారిటీలో వైసీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి
 • సర్వేపల్లిలో 1750 ఓట్ల ముందంజలో కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి కాకాణి
 • గూడూరులో 1700 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి వరప్రసాద్
 • నెల్లూరు సిటీలో 2473 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్న వైసీపీ అభ్యర్ధి అనిల్
 • నెల్లూరు రూరల్ లో 3000 ఓట్ల మెజార్టీలో వైసీపీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
 • ఆత్మకూరులో 3240 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ గౌతంరెడ్డి
 • కావలిలో 303 ఓట్ల మెజార్టీలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
 • కోవూరులో ఆలస్యంగా ప్రారంభమైన కౌంటింగ్
 • ఉదయగిరిలో 2700 ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి
   

తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్‌ ముందంజ 

 • హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ లీడింగ్‌
 • బాపట్ల పార్లమెంటు తొలి రౌండ్లో వైసీపీకి 1439 ఓట్లు ఆధిక్యం.
 • పాలకొండ రెండో రౌండ్ వైసీపీ అభ్యర్థి కళావతికి  1100 ఓట్ల ఆధిక్యం 

 

వారణాసిలో మోడీ, అమేథీలో రాహుల్‌ గాంధీ, కుప్పంలో చంద్రబాబునాయుడు, భీమవరంలో పవన్‌కల్యాణ్‌ వెనుకంజ

కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో తొలి రౌండ్ తర్వాత ట్రెండ్‌..

 • టెక్కలిలో తొలి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి తిలక్‌కు 1697 ఓట్ల ఆధిక్యం
 • పలాసలో తొలి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి అప్పలరాజులకు 546 ఓట్ల ఆధిక్యం

కుప్పంలో తొలి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళికి 67 ఓట్ల లీడింగ్‌, వైసీపీ అభ్యర్థికి 4456, టీడీపీ అభ్యర్థి చంద్రబాబుకు 4389 ఓట్లు


వాయినాడ్‌లో 25801 ఓట్ల ఆధిక్యంలో రాహుల్‌గాంధీ 

 • నగరిలో వైసీపీ అభ్యర్థి రోజా ముందంజ
 • గుంటూరు పశ్చిమ అసెంబ్లీ తొలి రౌండ్ 1400 టీడీపీ ఆధిక్యం
 • గుంటూరు తూర్పు అసెంబ్లీ తొలి రౌండ్ 1200 టీడీపీ ఆధిక్యం
 • గుంటూరు పార్లమెంట్ లో తొలి రౌండ్ లో టీడీపీకి 1400 ఓట్లు ఆధిక్యం
 • మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి  3000 ఓట్ల మెజార్టీలో చీపురుపల్లి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ
 • గజపతినగరం వైసీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య 5666 ఆధిక్యం
 • మహబూబ్ నగర్  మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 1852 ఓట్ల లీడ్‌  
 • శ్రీనివాస్ రెడ్డి... trs.... 4140
 • డికె అరుణ ....bjp.... 2298
 • వంశీ చంద్ రెడ్డి.....cong...2245
 •  ఖమ్మం రెండో రౌండ్ ముగిసేసరకి టీఆర్‌ఎస్‌ 4882 ఓట్ల లీడింగ్.
 • పీలేరు లో మెదటి రౌండ్ లో టీడీపీ ఆధిక్యత.
 • పలమనేరులో వైసీపీ లీడ్.
 • పాతపట్నం వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ 711 ఓట్లతో ఆధిక్యం
 • పొన్నూరులో తొలి రౌండ్ లో టీడీపీ ఆధిక్యం.
 • పత్తిపాడులో తొలి రౌండ్‌లో వైసీపీ అధిక్యం.
 • చిత్తూరు పార్లమెంట్‌.. మొదటి రౌండ్ లో వైసీపీ 834 ఓట్లు లీడ్

 కర్ణాటకలో మాంఢ్యలో.. తొలి రౌండ్ ముగిసేసరికి నిఖిల్‌కు 6774 ఓట్లు, సుమలతకు 6550 ఓట్లు

 • అరకు లోక్‌సభ స్థానంలో వైసీపీ లీడ్‌
 • మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపులో వైసీపీదే లీడ్‌ 

 వారణాసిలో ప్రధాని మోడీ లీడ్‌

 • గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ మొదటి రౌండ్‌లో 1300 ఓట్ల ఆధిక్యం
 • కరీంనగర్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి..
 • పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ముందంజ
 • బీజేపీకి 3062 ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 2939 ఓట్లు, కాంగ్రెస్‌కు 288 ఓట్లు
 • కరీంనగర్ పార్లమెంట్ మొదటి రౌండ్ బీజేపీకి 4400 ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 1900 ఓట్లు

 ముంబై ఉత్తర నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి ఊర్మిళ వెనుకంజ

 • భీమవరం పోస్టల్‌ బ్యాలెట్‌లో పవన్‌కల్యాణ్‌ వెనుకంజ
 • ఖమ్మం లో మొదటి రౌండ్ లో తెరాస అభ్యర్థి నామా 2544 ఓట్ల ఆధిక్యం...

కర్నూలు : ఆలూరు అసెంబ్లీకి 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ 

 • విశాఖలో ఎంపీ అభ్యర్థి భరత్ ఆధిక్యం
 • మంగళగిరిలో నారా లోకేష్‌కు స్వల్ప ఆధిక్యం
 • నెల్లూరు సిటీ, రూరల్‌లో వైసీపీ ఆధిక్యం
 • గుంటూరు పశ్చిమ ముందంజలో వైసీపీ
 • మాండ్యలో సుమలత 804 ఓట్ల ఆధిక్యం
 • బెంగళూరు నార్త్‌లో సాదానంద గౌడకు 1460 ఓట్ల ఆధిక్యం  
 • ఖమ్మం...పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అధిక్యం 106.

అమేథీలో సర్వర్‌ ఫెయిల్యూర్‌ కారణంగా కౌంటింగ్‌ నిలపివేత

భోపాల్‌లో సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ముందంజ
తమిళనాడులో మూడు చోట్ల డీఎంకే లీడ్‌
తిరువనంతపురంలో శశిథరూర్‌ వెనుకంజ
గుల్బర్గాలో మల్లికార్జున్‌ ఖర్గే వెనుకంజ
బెంగళూరు సెంట్రల్‌లో ప్రకాష్‌రాజ్‌ వెనుకంజ
రాజస్థాన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం
లీడ్‌లో సోనియా, రాహుల్‌

 • చీపురుపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ పోస్టల్ బ్యాలెట్ లో ముందంజ
 • మెదక్.. జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానాల్లో పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు లో టీఆర్ఎస్ ఆధిక్యత.
 • టెక్కలిలో అచ్చెన్నాయుడు వెనుకంజ
 • ఇచ్చాపురంలో వైసీపీ లీడ్‌ 

 

 గుజరాత్‌లో బీజేపీ 17,  కాంగ్రెస్‌ రెండు చోట్ల ముందంజ

 • కడప పార్లమెంట్‌ స్థానంలో వైసీపీ ముందంజ 
 • కర్ణాటక చికోడిలో బీజేపీ లీడ్‌
 • కేరళలోని కన్నూర్‌, వడకారాలో లెఫ్ట్‌, ఎర్నాకుళం, మలప్పురంలో యూడీఎఫ్‌, తిరువనంతపురంలో బీజేపీ ముందంజ

ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద హోమం..

కౌంటింగ్‌ ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్‌లో 17 లోక్ సభ నియోజకవర్గాలలో  కౌంటింగ్‌ మొదలైంది. 305 కౌంటింగ్ కేంద్రాలలో  పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 

 • ఎన్నికల లెక్కింపు వేళ.. తన నివాసం లోనే జగన్.. ప్రశాంత్ కిషోర్ కూడా అక్కడే..

ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసం ఎదుట యాగం నిర్వహిస్తున్న కాంగ్రెస్ అభిమాని..


 తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్‌లు - ఈవీఎంలను కౌంటింగ్‌కు సిద్ధం చేస్తున్న అధికారులు.

 • హంగ్‌ ఏర్పడే పక్షంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీలో విపక్షాల భేటీకి రంగం సిద్ధం.
 • యూపీఏతో పాటు  బీజేపీ వ్యతిరేక పార్టీలను ఈ భేటీకి ఆహ్వానించాలని భావిస్తున్న కాంగ్రెస్‌.  

ఎన్నికల ఫలితాల వేళ ఉదయాన్నే బెంగళూరులోని ఆలయంలో కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రత్యేక పూజలు

 

కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేనందున యూపీఎ పక్షాలతోపాటు మిగిలిన పార్టీలు కలిసి 'సెక్యూలర్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌' పేరుతో కొత్త ఫ్రంట్‌కు ప్రతిపాదన.

 • యూపీఏలోని ఆరు పార్టీలతోపాటు తెలుగుదేశం, తృణమూల్‌ కాంగ్రెస్‌, బహుజన సమాజ్, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, వామపక్షాలతో కలిసి ఈ కొత్త ఫ్రంట్‌.
 • కౌంటింగ్ పర్యవేక్షణకు టీడీపీ ప్రత్యేక చర్యలు. ఢిల్లీ, అమరావతిల్లో టీడీపీ కంట్రోల్ రూములు. 
 • పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్‌. కౌంటింగ్ పై నేతలకు దిశా నిర్దేశం.
 • ఏపీలో తొలి ఫలితం నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెలువడనుంది.
 • ఇవాళ 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం..