లిస్ట్ భారీగా ఉంది.. హిట్టయ్యేవి ఎన్నో..!!

లిస్ట్ భారీగా ఉంది.. హిట్టయ్యేవి ఎన్నో..!!

2018 లో టాలీవుడ్ సక్సెస్ రేట్ పర్వాలేదు.  పెద్ద సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి.  ఎప్పటిలాగే కొత్తసంవత్సరంలోకి అడుగుపెట్టగానే.. ఆ సంవత్సరం రాబోయే సినిమాల గురించి మాట్లాడుకోవడం సహజమే.  ఈ ఏడాది రిలీజ్ కాబోయే పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి.  

బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాతో సంక్రాంతి సందడి మొదలౌతుంది.  జనవరి 9 వ తేదీన ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అవుతుంది.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించే వార్తలు.  ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమా రంగం కోణంలో ఈ సినిమా ఉంటుంది.  భారీ క్యాస్టింగ్ తో సినిమా తెరకెక్కింది.  ట్రైలర్, పోస్టర్లు ఆకట్టుకుంటుండటంతో అంచనాలు పెరిగాయి.  ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. సెకండ్ పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7 న వస్తుంది.  

బాలకృష్ణ సినిమా తరువాత రిలీజ్ కాబోయే సినిమా వినయ విధేయ రామ.  బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా పక్కా మాస్ యాక్షన్ తో తెరకెక్కింది.  దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  దీనితరువాత జనవరి 12 న కితకితలు పెట్టేందుకు వెంకటేష్.. వరుణ్ తేజ్ లు ఎఫ్ 2 అంటూ ముందుకు వస్తున్నారు.  ఈ సినిమాల మధ్యలో జనవరి 10 వ తేదీన రజినీకాంత్ పేట రిలీజ్ కాబోతున్నది.  దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.  రజినీకాంత్ 2 పాయింట్ 0 సినిమా హిట్ కావడంతో పాటు.. టాలీవుడ్ లో వందకోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.  

సంక్రాంతి తరువాత అఖిల్ మిస్టర్ మజ్ను వచ్చే అవకాశం ఉంది.  ఆ తరువాత ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర రిలీజ్ అవుతుంది.  ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది.  మమ్మూట్టి హీరోగా చేస్తున్నారు.  అదే నెలలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.  ఏప్రిల్ విషయానికి వస్తే మహేష్ బాబు మహర్షి రిలీజ్ అవుతుంది.  న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేసిన సెకండ్ లుక్ ఆకట్టుకుంది.  ఆగస్టు 15 వ తేదీన సైరా, ప్రభాస్ సాహో లు రిలీజ్ అవుతున్నాయి.  వీటితో పాటు చాలా సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కాబోతున్నాయి.  మరి వీటిల్లో ఎన్ని హాట్ అవుతాయో తెలియాలంటే ఆయా సినిమాలు రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.