2021 మహిళా ప్రపంచ కప్ వాయిదా...

2021 మహిళా ప్రపంచ కప్ వాయిదా...

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ఒలంపిక్స్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. అందులోనూ ముఖ్యంగా క్రికెట్ ప్రపంచానికి చాల నష్టం కలిగించింది. ఈ వైరస్ కారణంగా పదుల సంఖ్యలో ద్వైపాక్షిక సిరీస్లు వాయిదా పడ్డాయి. అలాగే ముఖ్యమైన ఆసియా కప్, ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్లు కూడా వాయిదా పడ్డాయి. ఇక నిన్న నిర్వహించిన ఐసీసీ సమావేశంలో వచ్చే ఏడాది జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచ కప్ ను కూడా ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ఇక ఈ నిర్ణయం పై భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించింది. 'ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనకు కలిసొచ్చే అంశం చూసుకోవాలి. ప్రపంచ కప్ వాయిదా పడినంత మాత్రాన టైటిల్ సాధించాలనే మా లక్ష్యం మారదు. ఈ  వాయిదా కారణంగా మా లక్ష్యాన్ని సాధించడానికి మాకు ఇంకా ఎక్కువ సమయం దొరికింది అని తెలిపారు'.