ఏపీలో  కరోనా విజృంభణ...  

ఏపీలో  కరోనా విజృంభణ...  

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు  పెరిగిపోతున్నాయి.  జూన్ ముందు వరకు ఒక మోస్తరుగా నమోదవుతూ వస్తున్న కేసులు, జూన్ నుంచి భారీగా పెరగడం మొదలుపెట్టాయి.  ఏపీ ప్రభుత్వం కరోనా టెస్టులను కూడా పెంచింది.  టెస్టులు పెంచడంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నది.  తాజా సమాచారం ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 207 కొత్త కేసులు మామోదయ్యాయి.  

దీంతో మొత్తం కేసుల సంఖ్య 5636 కి చేరింది.  మొత్తం ఎపిలో కరోనా కారణంగా 8 0 మంది మరణించారు.  కేసుల సంఖ్య పెరుగుతున్నా, మరణాల సంఖ్య అదుపులోనే ఉండటం విశేషం.   నమోదైన 207 కేసుల్లో ఏపి రాష్ట్రానికి సంబంధించి 141 ఉండగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 66 కేసులు నమోదైనట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొన్నది.