కేసీఆర్‌ డెడ్‌లైన్.. విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికుల సంఖ్య ఇదే..!

కేసీఆర్‌ డెడ్‌లైన్.. విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికుల సంఖ్య ఇదే..!

ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది.. అయితే, విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులు ఫైనల్ డెడ్‌లైన్ పెట్టారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఈ నెల 5వ తేదీ రాత్రి 12 గంటల్లోపు విధుల్లో చేరాలని.. లేని పక్షంలో అన్ని రూట్లను ప్రైవేట్‌కు అప్పగించనున్నట్టు ప్రకటించారు. అయితే.. ఇప్పటి వరకు 208 మంది ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరినట్టు తెలుస్తోంది.. సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత ఇప్పటి వరకు 208 మంది విధుల్లో చేరగా.. 3వ తేదీన 17 మంది, 4వ తేదీన 34 మంది, ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 157 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరినట్టు అధికారులు చెబుతున్నారు.