తెలంగాణ కరోనా అప్డేట్: కొత్తగా ఎన్నంటే... 

తెలంగాణ కరోనా అప్డేట్: కొత్తగా ఎన్నంటే... 

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా తగ్గుతున్నది.  తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 214 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,92,835కి చేరింది.  ఇందులో 2,87,468 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,781 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1586కి చేరింది.  రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 28,791 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 76,02,975 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.