తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు

తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు

తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు ఒకేసారి మళ్లీ భారీగా పెరిగాయి... నిన్న 1,302 కేసులు మాత్రమే నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,143 మంది కరోనాబారినపడిన వాళ్లు కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,74,774కు చేరుకోగా.. మృతుల సంఖ్య 1,052కు పెరిగింది. ఇక, ఇప్పటి వరకు 1,44,073 మంది రికవరీ అయ్యారు. మరోవైపు.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 29,649గా ఉండగా.. అందులో 22,620 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 309 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి 166, మేడ్చల్ 147, కరీంనగర్‌ 127, నల్గొండ 113 కేసులు ఇవాళ అత్యధికంగా నమోదు అయ్యాయి.