కోజికోడ్ రెస్క్యూ ఆపరేషన్: 22 మందికి కరోనా... 

కోజికోడ్ రెస్క్యూ ఆపరేషన్: 22 మందికి కరోనా... 

దుబాయ్ నుంచి కేరళకు వస్తున్నా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం కోజికోడ్ రన్ వే మీద కూలిపోయిన సంగతి తెలిసిందే.  రన్ వే ను ఢీకొట్టి రెండు ముక్కలైంది.  వెంటనే స్పందించిన యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.  ప్రయాణికులను కాపాడారు.  ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.  ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బంది, అధికారులకు కేరళ ప్రభుత్వం కరోనా టెస్టులు నిర్వహించింది.  

ఈ పరీక్షల్లో 22  మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగింది.  దీంతో వీరిని క్వారంటైన్ కు తరలించారు.  ఇందులో కోజికోడ్ జిల్లా కలెక్టర్, ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నట్టు వైద్యశాఖాధికారులు చెప్తున్నారు.  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగిన 22 మందికి త్వరలోనే కోలుకుంటారని కేరళ ప్రభుత్వం చెప్తున్నది.