సచివాలయ ఉద్యోగాలకు రికార్డు సంఖ్యలో దరఖాస్తులు!

సచివాలయ ఉద్యోగాలకు రికార్డు సంఖ్యలో దరఖాస్తులు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భర్తీచేసేందుకు సిద్ధమైన 1.33 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు ముగిసింది. ఆదివారం రాత్రితో దరఖాస్తు, ఫీజు చెల్లింపు గడువు ముగిసిపోయాయి.. అయితే, భారీ సంఖ్యలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు నిరుద్యోగులు. 1.33 లక్షల ఉద్యోగాలకు 22.73 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. వీరిలో పరీక్ష ఫీజు చెల్లించినవారు 21.69 లక్షల మంది ఉన్నారు. కాగా, నోటిఫికేషన్లు జారీ చేసినప్పుడే దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేయగా.. ఇప్పుడు దరఖాస్తులు అంచనాలను మించి 22.73 లక్షలకు పైగా వచ్చాయి.