తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. అయినా భారీగానే

తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. అయినా భారీగానే

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. అయితే, నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి... తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 2275 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మృతి చెందారు. దీంతో.. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,54,880కు చేరుకోగా... ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 950కి చేరింది. మరోవైపు.. రాష్ట్రంలో రికవరీ రేటు పెరుగుతూనే ఉంది.. గత 24 గంటల్లో 2,458 మంది రికవరీ కాగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,21,925కు చేరింది. మరణాల రేటులో తెలంగాణలో 0.61శాతానికి తగ్గగా.. రికవరీలో రేటులో 78.7 శాతానికి పెరిగినట్టు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,005 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 25,050 మంది హోం క్వారంటైన్, హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. ఇక, జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 331 కేసులు నమోదు కాగా.. మేడ్చల్‌లో 150, కరీంనగర్‌ 121, నల్గొండ 126, రంగారెడ్డి 184 ఇలా ఇవాళ అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.