పశ్చిమ గోదావరి జిల్లాలో అమల్లోకి వచ్చిన కర్ఫ్యూ... 

పశ్చిమ గోదావరి జిల్లాలో అమల్లోకి వచ్చిన కర్ఫ్యూ... 

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా ఉదృతిని తగ్గించేందుకే అక్కడి జిల్లా యంత్రాంగం ప్రతి ఆదివారం రోజున పూర్తి స్థాయి కర్ఫ్యూను విధించాలని నిర్ణయించింది.  ఈ ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ విధిస్తున్నారు.  మెడికల్, నిత్యవసర వస్తువుల షాపులు మాత్రమే అందుబాటులో ఉండబోతున్నాయి.  మిగతా దుకాణాలు ఏవీ కూడా తెరవకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.  ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని, అనవసరంగా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కరోనా నివారణ కోసం ప్రజలు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.