ఆగస్టు 26 ఆటగాళ్ల ప్రయాణం... నవంబర్ 10 న ఐపీఎల్ ఫైనల్

ఆగస్టు 26 ఆటగాళ్ల ప్రయాణం... నవంబర్ 10 న ఐపీఎల్ ఫైనల్

కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరగనుండటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే మార్చి 29 న జరగాల్సిన ఐపీఎల్ 2020 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - దుబాయ్, అబుదాబి, షార్జాలోని మొత్తం 3 వేదికలలో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకు జరుగుతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ఇంతకముందు ప్రకటించారు. కానీ మిగితా వివరాలు ఏం తెలుపలేదు. ఆ తర్వాత మళ్ళీ ఐపీఎల్ ఫైనల్ రెండు రోజులు వాయిదా పడనుంది అని వార్తాలు వచ్చాయి. ఇక ఈ రోజు జరిగిన ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో ఫైనల్ తో పాటుగా అన్ని విషయాల పైన క్లారిటీ వచ్చేసింది. 

ఐపీఎల్ టోర్నమెంట్ యొక్క 13 వ సీజన్ కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు 24-ప్లేయర్ స్క్వాడ్స్ యూఏఈ కి అనుమతించబడతాయి. అందులో ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు వారి స్థానంలో మరొక ఆటగాడు జట్టులోకి రావచ్చు. ఐపీఎల్ యొక్క ఎనిమిది జట్లు ఆగస్టు 26 న యూఏఈకి చార్టర్డ్ విమానాలలో బయలుదేరుతాయి. కానీ ఇంకా భారత ప్రభుత్వం అనుమతి పెండింగ్ లో ఉంది. ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 ప్రారంభమై నవంబర్ 10 న జరగనున్న ఫైనల్ తో ముగుస్తుంది.