నకిలీ వీసాలు.. 26 మంది మహిళలు అరెస్ట్

నకిలీ వీసాలు..  26 మంది మహిళలు అరెస్ట్

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమిరిగేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించగా నకిలీ వీసాలు కలిగిన 26 మంది మహిళలు అరెస్ట్ అయ్యారు. బుధవారం ఉదయం ఇమిరిగేషన్ అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నకిలీ విసాలతో కువైట్ వెళుతున్న 26 మంది మహిళను ఇమిరిగేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.