రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో క‌ల‌క‌లం.. 279 మందికి క‌రోనా..!

రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో క‌ల‌క‌లం.. 279 మందికి క‌రోనా..!

రాజ‌మండ్రి సెంట్రోల్ జైలులో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం సృష్టించింది.. తాజాగా నిర్వ‌హించిన క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో... సెంట్రల్ జైలులో 247 మంది ఖైదీలు, 32 సిబ్బందికి పాజిటివ్‌గా తేలిన‌ట్టు అధికారులు తెలిపారు.. ప్ర‌స్తుతం జైలులో.. 1,600 మంది ఖైదీలు ఉండ‌గా.. 900 మంది ఖైదీలకు మొదటి దశ వైద్య పరీక్షలను ఐమాస్క్ అనే మొబైల్ ద్వారా నిర్వహించారు వైద్యాధికారులు.. ఈ ప‌రీక్ష‌ల్లో మొత్తం 279 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.. మ‌రోవైపు.. కరోనా క‌ట్ట‌డిలో భాగంగా కొత్త రిమాండ్ ఖైదీల ప్రవేశాన్ని నిలిపివేశారు జైలు అధికారులు. కాగా, ఏపీలో రోజురోజుకూ క‌రోనా టెస్ట్‌ల సంఖ్య‌తో పాటు.. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతున్న విష‌యం తెలిసిందే.