బొమ్మ తుపాకి అనుకుని కాల్చుకున్నాడు..కానీ చివరికి..!

బొమ్మ తుపాకి అనుకుని కాల్చుకున్నాడు..కానీ చివరికి..!

బొమ్మ తుపాకీ అనుకుని కాల్చుకుంటే ఏకంగా ఓ యువకుడి ప్రాణం పోయింది. ఈ ఘటన మహారాష్ట్ర, థానే జిల్లాలోని షాహాపూర్‌లో చోటు చేసుకుంది.  పోలీసుల వివరాల ప్రకారం.. అటగావ్‌లోని రెసిడెన్షియల్ కాలనీలో ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పక్క ఫ్లాట్‌లో ఉంటున్న సిద్ధేశ్ జనగం (28) ఆ బర్త్ డే కి హాజరయ్యాడు. కాగా ఆ ఇంట్లో తుపాకి కనిపించడంతో దానిని చేతుల్లోకి తీసుకుని పరిశీలించాడు. బొమ్మ తుపాకిగా భావించి తన తలకు గురిపెట్టుకున్నాడు. సరదాగా కాల్చుకోగా బుల్లెట్ బయటికి వచ్చి అతడి శరీరంలోకి దూసుకుపోయింది. దాంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. తుపాకి పేలిన శబ్దానికి చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకోగా సిద్ధేశ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ జరిపారు. తుపాకిని భరత్‌షేరే అనే వ్యక్తికి సంబంధించినదిగా గుర్తించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.