వ్యాక్సిన్ ఎఫెక్ట్: నార్వేలో పెరుగుతున్న మరణాలు

వ్యాక్సిన్ ఎఫెక్ట్: నార్వేలో పెరుగుతున్న మరణాలు

ప్రపంచంలో కరోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు అమెరికా ఫైజ‌ర్ టీకాను రిలీజ్ చేసింది.  ఫైజ‌ర్‌టీకా పై ప్ర‌పంచం ఎన్నో అంచ‌నాలు పెట్టుకుంది.  ఫైజ‌ర్ టీకా స‌మ‌ర్ధ‌త కూడా 95శాతం వ‌ర‌కు ఉన్న‌ట్టు ట్ర‌య‌ల్స్ లో తేలింది.  అమెరికాలో త‌యారైన ఈ ఫైజ‌ర్ టీకాను మొద‌ట‌గా బ్రిట‌న్ ఆమోదం తెలిపింది.  వ్యాక్సిన్‌ను మైన‌స్ 70 డిగ్రీల వ‌ద్ద స్టోర్ చేయాల్సి ఉంటుంది.  ఇక ఇదిలా ఉంటే, నార్వేలో కూడా ఫైజ‌ర్ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది.  వేలాది మందికి వ్యాక్సిన్ అందించారు. వ్యాక్సిన్ తీసుకున్న అనేక మందిలో సైడ్ ఎఫెక్ట్ క‌నిపించాయి.  వ్యాక్సిన్ విక‌టించి నిన్న‌టి రోజున 23 మంది మ‌ర‌ణించ‌గా, నేటికి ఆ సంఖ్య 29కి చేరింది.  మ‌ర‌ణిస్తున్న వారిలో 75 నుంచి 85 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న వ్య‌క్తులు ఎక్కువ‌గా ఉన్నారు.  వ్యాక్సిన్ తీసుకున్న వంద‌ల మందిలో సైడ్ ఎఫెక్ట్ క‌నిపిస్తుండ‌టంతో నార్వే ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.  త‌గిన చర్య‌లు తీసుకుంటోంది.