రికార్డ్ స్థాయిలో ఏపీలో కరోనా కేసులు... 24 గంటల్లో... 

రికార్డ్ స్థాయిలో ఏపీలో కరోనా కేసులు... 24 గంటల్లో... 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  కరోనా కట్టడికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.  టెస్ట్ ట్రేస్ అండ్ ట్రీట్ పేరుతో ఏపీ ప్రభుత్వం కరోనాకు చికిత్స అందిస్తోంది.  గడిచిన 24 గంటల్లో 15,633 టెస్టులు నిర్వహించగా, 294 పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయ్యాయి.  ఇందులో ఏపీకి సంబంధించి 253 మందికి కరోనా సోకగా, విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో ఇద్దరికి కరోనా వచ్చినట్టు నిర్ధారణ జరిగింది.  ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 33 మందికి కరోనా సోకినట్టు ఏపీ ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన బులిటెన్ లో పేర్కొన్నది.  

ఇక గడిచిన 24 గంటల్లో ఇద్దరు మరణించారు.  దీంతో మరణాల సంఖ్య 84కి చేరింది.  ఈరోజు నమోదైన 294 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6152కి చేరింది.   ఏపీలో 2034 యాక్టివ్ కేసులుండగా, 2723 మంది డిశ్చార్జ్ అయ్యినట్టు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.